Telangana Rains : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 7 జిల్లాలకు రెడ్, 11 జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుట మండలంలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

Telangana Rains : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 7 జిల్లాలకు రెడ్, 11 జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Heavy Rain

Telangana Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం కూడా కురిసింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని వెల్లడించింది.

అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుట మండలంలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. నిజామాబాద్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ నగరంలోనూ ఏకధాటిగా వర్షం పడింది.

Heavy Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. రాత్రంతా కురుస్తూనే ఉన్న వర్షం

ఇవాళ (మంగళవారం) కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ కురుస్తాయని హైదరాబాద్ వాతారణ కేంద్రం హెచ్చరించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్జ్ జారీ చేసింది. 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ – మాల్కాజిగిరి, యాదాద్రి – భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలర్జ్ జారీ చేసింది.

కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, సిద్ధిపేట, కామారెడ్డి, వనపర్తి, బోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నాయి. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు జగిత్యాల, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Telangana Rains : భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణలో రానున్న 5 రోజులు వానలు

ఇక మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి – భువనగిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. రాత్రంతా వర్షం కురుస్తూనేవుంది. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

Heavy Rains : ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు. మరో రెండు రోజులు గ్రేటర్ లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.