Hot Summer TS : నిప్పుల కుంపటిని తలపిస్తున్న తెలంగాణ, ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు నమోదయ్యే అవకాశం

Hot Summer TS: నిప్పులు చెరుగుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు ఎండవేడి, ఉక్కబోత.. దీనికి తోడు వడగాలులు వణికిస్తున్నాయి.

Hot Summer TS : నిప్పుల కుంపటిని తలపిస్తున్న తెలంగాణ, ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు నమోదయ్యే అవకాశం

Hot Summer

Updated On : June 18, 2023 / 12:41 PM IST

Hot Summer TS : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. మాడు పగిలే ఎండలతో హడలిపోతున్నారు. సుర్రుమంటున్న సూర్యుడితో భయాందోళనకు గురవుతున్నారు. ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తీవ్రతకు తాళలేక తల్లిడిల్లిపోతున్నారు. తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. నిప్పులు చెరుగుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు ఎండవేడి, ఉక్కబోత.. దీనికి తోడు వడగాలులు వణికిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వృద్ధులు, చంటి పిల్లలు నరకయాతన పడుతున్నారు. కొత్తగూడెం ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేయడం స్థానిక ప్రజలను భయపెడుతోంది.(Hot Summer TS)

Also Read..Hot Summer : సమ్మర్ స్ట్రోక్.. ఏపీ ప్రజలకు అలర్ట్, మరింత పెరగనున్న ఎండల తీవ్రత

ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. సుర్రుమనే ఎండ కారణంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం సాహసం చేయలేకపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం అనగానే గుర్తుకొచ్చేది సింగరేణి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందుకి సంబంధించిన దానిలో ఎక్కువగా సింగరేణి ఓపెన్ క్యాస్ట్ లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో సాధారణంగానే అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఎండలు మండిపోతున్నాయి. దాంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మర్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ముందు ముందు మరెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కాస్త చల్లదనం కోసం, ఎండవేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు జ్యూస్ లు, కొబ్బరిబోండాలు తాగుతున్నారు.

Also Read..Andhra Pradesh : ఎండవేడికి పగిలిన కొండరాయి .. మీదపడుతుందోనని ఊరొదిలిపోతున్న జనాలు

ఉష్ణోగ్రతలు ఇలానే పెరుగుతూ పోతే కనుక.. సింగరేణి ప్రాంతంలో నీళ్లతో కూలింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిబ్బందికి సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటుంది. సిబ్బంది డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు వారికి మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. బయట 40 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే.. ఓపెన్ క్యాస్ట్ లలో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. కింద నుంచి వచ్చే వేడి, పైనుంచి మండుతున్న సూర్యుడు.. ఈ రెండింటి ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.