Telangana Congress: కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు.. నియోజకవర్గాల వారిగా పరిశీలన ప్రారంభం..

మొత్తం 119 నియోజకవర్గాలకు వెయ్యికిపైగా దరఖాస్తులకుపైగా వచ్చాయి. ఆశావహుల్లో పలువురు పారిశ్రామిక వేత్తలూ ఉన్నారు. కొందరు రెండు, మూడు నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు.

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు.. నియోజకవర్గాల వారిగా పరిశీలన ప్రారంభం..

Congress Party

TS Congress Party: తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల జాబితానుసైతం విడుదల చేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారిగా బరిలో నిలిచేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. శుక్రవారంతో ఈ దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. మొత్తం 119 నియోజకవర్గాలకు వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి. ఆశావహుల్లో పలువురు పారిశ్రామిక వేత్తలూ ఉన్నారు. కొందరు రెండు, మూడు నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు.

TTD : 24 మందితో టీటీడీ కొత్త పాలక మండలి.. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొండల్ నియోజకవర్గం నుంచి, భట్టి విక్రమార్క మధిర, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, ఆయన సతీమణి పద్మావతి కోదాడ, జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం, మధుయాస్కీ గౌడ్ ఎల్బీ నగర్ నియోజకవర్గం, పొన్నం ప్రభాకర్ హస్నాబాద్, కొండ సురేఖ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఇలా రాష్ట్రంలోని పార్టీ అగ్రనేతలు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ఆయా నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ల కేటాయింపు సమయంలో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది.

Tummala Nageswararao : ఖమ్మం జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా.. కానీ, ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తా : తుమ్మల

కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో పార్టీ అగ్రనేతల వారసులు ఉన్నారు. అందోలు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ దామోదర రాజనరసింహ, ఆయన కుమార్తె త్రిష దరఖాస్తు చేసుకున్నారు. సీనియర్ నేత జానారెడ్డి పోటీకి దరఖాస్తు చేసుకోలేదు. ఎన్నికల బరి నుంచి ఆయన దూరంగా ఉన్నారు. అయితే, ఆయన ఇద్దరు కుమారులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడకు, చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గంకు దరఖాస్తు చేసుకున్నారు. ముషీరాబాద్ లో టికెట్ ఆశిస్తూ అంజన్ కుమార్ యాదవ్ దరఖాస్తు చేసుకోగా, అదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడుసైతం దరఖాస్తు చేసుకున్నాడు. వనపర్తి నియోజకవర్గం టికెట్ ఆశిస్తూ చిన్నారెడ్డి దరఖాస్తు చేసుకోగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డికూడా దరఖాస్తు చేసుకున్నాడు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ కోసం పి. విష్ణువర్దన్ రెడ్డి, అజారుద్దీన్‌లు దరఖాస్తు చేసుకోగా, ఖైరతాబాద్ నియోజకవర్గం టికెట్ కోసం విజయారెడ్డి, రోహిన్ రెడ్డి, వినోద్ రెడ్డిలు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఇల్లందు నియోజకవర్గం నుంచి 38 మంది టికెట్ కోసం గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరితో పాటు మాజీ మంత్రులు జానారెడ్డి,  గీతారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డిలు పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు.