MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట.. నవంబర్ 20వరకు సమన్లు జారీ చేయబోమన్న ఈడీ

అక్టోబర్‌ 18న పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ పేర్కొన్నారు. ఆ తరువాతే మహిళ ఈడీ కార్యాలయ విచారణ పిటిషన్ పై విచారణ చేపడుతామని ధర్మాసనం చెప్పింది.

MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట.. నవంబర్ 20వరకు సమన్లు జారీ చేయబోమన్న ఈడీ

MLC Kavitha Huge Relief

Updated On : September 26, 2023 / 2:16 PM IST

MLC Kavitha Huge Relief : సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ వాయిదా పడింది. నవంబర్‌ 20న తదుపరి విచారణ చేపడతామని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ధర్మాసనం తెలిపింది. అక్టోబర్‌ 18న పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ పేర్కొన్నారు. ఆ తరువాతే మహిళ ఈడీ కార్యాలయ విచారణ పిటిషన్ పై విచారణ చేపడుతామని ధర్మాసనం చెప్పింది.

అప్పటి వరకు ప్రస్తుతం అమలులో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం వెల్లడించింది. అప్పటి వరకు కవితను విచారణకు పిలవబోమని ధర్మాసనంకు ఈడీ తరపు న్యాయవాది ఎఎస్‌జి రాజు చెప్పారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కవితకు సమన్లు ఇవ్వొద్దని ఈడీకి ధర్మాసనం సెప్టెంబర్ 15న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అవే ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం పేర్కొంది.

MLC Kavitha : గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం.. ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

మహిళలు అయినా, ఏ స్థాయిలో ఉన్నారు అనేది పక్కన పెడితే విచారణకు అసలు పిలవద్దు అంటే ఎలా అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు. మహిళల విచారణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న ధర్మాసనం తెలిపింది. కేసు విచారణ జరుగుతుంది ఢిల్లీలోనేనని ఈడీ తరపు సీనియర్ న్యాయవాది తెలిపారు.

కేసుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు, వివరాలు గతంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులన్నీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు పీఎంఎల్ఏ, ఈడీకి ముడిపడి ఉన్నందున అక్టోబర్ 18 తర్వాత విచారణకు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.