Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్.. హైదరాబాద్‌లో ఎంత మంది దొరికారో తెలుసా? అందరి లైసెన్సులూ రద్దు!

డిసెంబర్ 31, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువఝాము వరకు నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. నగరంలోని అనేక చోట్ల నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 5,819 మంది పట్టుబడ్డారు.

Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్.. హైదరాబాద్‌లో ఎంత మంది దొరికారో తెలుసా? అందరి లైసెన్సులూ రద్దు!

Updated On : January 1, 2023 / 12:26 PM IST

Hyderabad: కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మహా నగరంలో తాగి వాహనాలు నడుపుతూ మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు. పదులు, వందల సంఖ్యలో కాదు.. వేల సంఖ్యలో మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో బుక్కయ్యారు.

Nitish Kumar: ‘కొత్త జాతి పిత’ దేశం కోసం ఏం చేశాడు? మోదీపై నితీష్ కుమార్ విమర్శలు

డిసెంబర్ 31, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువఝాము వరకు నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. నగరంలోని అనేక చోట్ల నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 5,819 మంది పట్టుబడ్డారు. పోలీసులు మందు బాబుల వాహనాలు స్వాధీనం చేసుకుని, వీళ్లందరి డ్రైవింగ్ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేస్తున్నారు. నగర పరిధిలోని ఐదు జోన్లలో ఆర్టీఏ అధికారులు ఈ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేశారు. తాగి వాహనాలు నడిపి, ప్రమాదాలకు కారణం కాకూడదనే ఉద్దేశంతో అధికారులు ఈ టెస్టులు నిర్వహించారు. పలు చోట్ల తాగి వాహనాలు నడిపిన వాళ్లను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు చేసిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

North Korea: మరిన్ని అణ్వాయధ క్షిపణులు తయారు చేయండి.. అధికారులను ఆదేశించిన కిమ్

నార్త్ జోన్ పరిధిలో 1103 లైసెన్స్‌లు, సౌత్ జోన్ పరిధిలో 1151 లైసెన్స్‌లు, వెస్ట్ జోన్‌లో 1345 లైసెన్స్‌లు, ఈస్ట్ జోన్‌లో 510 లైసెన్స్‌లతోపాటు, సెంట్రల్ జోన్‌లో కూడా పలువురి లైసెన్స్‌లు క్యాన్సిల్ చేశారు. గతేడాది ఇదే సమయంలో 3220 లైసెన్స్‌లు మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి. అప్పుడు రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరికిన వారితో పోలిస్తే, ఈ ఏడాది దొరికిన వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.