కరోనా భయం : రూ. 1.60 మాస్క్..రూ. 20 పైనే!

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 01:50 AM IST
కరోనా భయం : రూ. 1.60 మాస్క్..రూ. 20 పైనే!

Updated On : March 4, 2020 / 1:50 AM IST

నగరంలో కరోనా భయం నెలకొంది. వైరస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మాస్క్‌లు ధరిస్తున్నారు. ఒక్కసారిగా మాస్క్‌లకు ఫుల్ డిమాండ్స్ ఏర్పడ్డాయి. ఇదే అదనుగా మాస్క్ రేట్లను పెంచేసినట్లు తెలుస్తోంది. రూ. 1.60 లభించే మాస్క్‌ను ఏకంగా రూ. 20, అదే రూ. 30-40 విలువ చేసే S-95 మాస్క్‌ ధర రూ. 300 విక్రయిస్తున్నట్లు టాక్. మాస్క్‌లకు ఎలాంటి కొరత లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తోంది. జనరిక్ ఔషధ దుకాణాల్లో తక్కువగా ఉంటాయని అనుకున్నా..అలాంటి సీన్ కనిపించడం లేదని సమాచారం. 

నగరంలోని కీలక ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్దనున్న మెడికల్ షాప్స్ కిటకిటలాడుతున్నాయి. మాస్క్‌లు ఇవ్వాలంటూ క్యూ కడుతున్నారు. డిమాండ్‌ దృష్టిలో పెట్టుకుని హోల్ సేల్ వ్యాపారస్తులతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు సమాచారం. గతంలో 100 మాస్క్‌లు ఉన్న ఒక ప్యాకెట్ ధర రూ. 160 వరకు విక్రయించే వారు. ఇప్పుడు రూ. 1600 పైనే విక్రయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ధరలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్క్‌లు లేవని కొందరు మందు దుకాణాల యజమానులు చెబుతున్నారు.

హోల్ సేల్‌లో ధరలను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి దోపిడిని అరికట్టాలని, ధరలను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 
 

* రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్‌ మహమ్మారి మరింత విస్తరించకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 
* వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు వందకోట్లు కేటాయించింది. 
* గాంధీ, ఫీవర్, చెస్ట్‌ ఆస్పత్రులు, కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఆస్పత్రితోపాటు వికారాబాద్‌లోని టీబీ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేసింది. 

* హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు మెడికల్‌ అనుబంధ ఆసుపత్రుల్లో 3 వేల పడకలను అందుబాటులో ఉంచాలని యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
* హైదరాబాద్‌లో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసు నమోదుకావడంతో అటు ప్రభుత్వం.. ఇటు వైద్యారోగ్య శాఖ అధికారులు పరుగులు పెడుతున్నారు. 
* వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌కు ఇవ్వాల్సిన చికిత్సపై అధ్యయనం చేసేందుకు 15 మంది డాక్టర్లు, జిల్లా వైద్యాధికారుల బృందాన్ని కేరళకు పంపిస్తున్నామని చెప్పారు. 

* వైరస్‌ కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు పాటిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొరత ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి 50 వేలు మాస్కులు పంపించాలని కేంద్రాన్ని కోరామన్నారు. 

Read More : All The Best : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు