Ronald Ross : న్యూస్ ను న్యూస్ గా మాత్రమే వేయాలి.. ఒకరికి ప్రమోట్ చేసే విధంగా ఉండొద్దు : ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్
అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఫామ్ -6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

Election Officer Ronald Ross
Ronald Ross – Cable Operators : న్యూస్ ను న్యూస్ గా, అడ్వర్టైజ్ మెంట్ ను అడ్వర్టైజ్ మెంట్ గా మాత్రమే వేయాలని, ఒకరికి ప్రమోట్ చేసే విధంగా ఉండొద్దని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. సోమవారం కేబుల్ ఆపరేటర్స్ తో ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫామ్ -6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
ఎలక్షన్ కమిషన్ యాప్ లేదా 1950 నెంబర్ కు కాల్ చేసి ఓటు ఎక్కడ ఉంది.. ఎలా నమోదు చేసుకోవాలని తెలుసుకోవచ్చన్నారు. 2022లో 2 లక్షల 75 వేల డూప్లికేట్ ఓట్లను తొలగించామని తెలిపారు. గడిచిన వారం రోజుల్లో 50 వేల నకిలీ ఓట్లను తొలగించామని పేర్కొన్నారు. 3 లక్షల 61 వేల ఓట్లకు షిఫ్ట్ అయిన వారు అప్లై చేసుకున్నారని వెల్లడించారు. ఓటర్ ఐడెంటిఫికేషన్ స్లిప్స్ ను ప్రతి ఓటరుకు పంచుతన్నామని తెలిపారు.
Ponnala Lakshmaiah : బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య, పార్టీ కండువా కప్పిన సీఎం కేసీఆర్
వీటి ద్వారా ఎక్కడ ఓటు వేయాలన్న దానిపై క్లారిటీ వస్తుందన్నారు. పకడ్బందీగా ఎలక్టోరల్ చేశామని పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కచ్చితంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 90 ఫ్లైయింగ్ స్క్వాడ్ లతో పాటు జిల్లా పరిధిలో 18 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. చెకింగ్ చేస్తున్న క్రమంలో ప్రతిదీ వీడియో రికార్డింగ్ చేస్తామని చెప్పారు.
నగదు, బంగారంతోపాటు తమతో తీసుకెళ్తున్న ప్రతిదానికీ ప్రూఫ్ క్యారీ చేయాలని సూచించారు. 10 లక్షలకు పైగా క్యారీ చేస్తే వాటిని ఐటీకి పంపుతామని తెలిపారు. మద్యం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై ఎలక్షన్ చాలా సీరియస్ గా ఉందన్నారు. నవంబర్ 3 నుండి నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. నవంబర్ 10వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అని ప్రకటించారు. ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు.