Hyderabad Ganesh Nimajjanam 2023: వర్షంలోనూ గణేశ్ శోభా యాత్ర..
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగిసింది. గణేశుడి భారీ విగ్రహం గంగమ్మ ఒడికి చేరింది.

Khairatabad Ganesh Nimajjanam
హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం వేళ హుస్సేన్ సాగర్ చుట్టూ 36 క్రేన్లు ఏర్పాట్లు చేశారు. మహానగరంలో మరో 100 చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు.
LIVE NEWS & UPDATES
-
అదే జోష్.. అదే ఉత్సహంతో..
రాత్రి సమయంలోనూ అదే జోష్.. అదే ఉత్సహంతో శోభాయాత్ర జరిగింది. గణేశుడి విగ్రహాల వద్ద పువ్వులు, పండ్లతో అలంకరణలు చేశారు. మిరమిట్లు గొల్పే ఎల్ఈడీ వెలుగులో.. కాషాయ జెండాలు, జాతీయ జెండాలు చేతబట్టి నిమజ్జనంతో భక్తులు పాల్గొంటున్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా డీజే సౌండ్స్, డ్రమ్స్ చప్పుళ్లకు డ్యాన్సులు వేశారు భక్తులు.
-
గుజరాతీ నృత్యాలు, దాండియా ఆటలతో..
ఎమ్‌జే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో శోభాయమానంగా గణేశుడి విగ్రహాలు ముందుకు కదులుతున్నాయి. గుజరాతీ నృత్యాలు, దాండియా ఆటలతో ఉత్సహంగా భక్తులు పాల్గొన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ మెట్రో స్టేషన్, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ మధ్య పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. మెట్రో సౌకర్యం ఉండడంతో ఇంతమంది ఇక్కడకు తరలివచ్చారు.
-
గంగమ్మ ఒడికి బాలాపూర్ గణనాథుడు
బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. హుస్సేన్ సాగర్ వద్ద 13వ నంబరు క్రేన్ ద్వారా బాలాపూర్ గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
-
చార్మినార్ వద్ద భక్తుల రద్దీ
చార్మినార్ వద్ద భక్తుల రద్దీ పెరిగింది. ఇదే సమయంలో అక్కడ వర్షం పడుతోంది. చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్ తీరం వైపు గణనాథుడి విగ్రహాలు వెళ్తున్నాయి. వర్షంలోనూ గణేశ్ శోభా యాత్ర కొనసాగుతోంది.
-
గణేశ్ నిమజ్జనంపై ఏరియల్ సర్వే
గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం ఏరియల్ సర్వే నిర్వహించింది. ఇందులో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజన్ కుమార్, కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. బాలాపూర్ గణేశుడి విగ్రహం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది.
-
గణేశ్ నిమజ్జనంలో పోలీసుల స్టెప్పులే స్టెప్పులు...
-
సీవీ ఆనంద్ ఇంటి వద్దే గణేశుడి నిమజ్జనం
-
చార్మినార్‌కు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు.
ఎంజే మార్కెట్ వద్ద గణపతి శోభాయాత్ర తిలకించేందుకు స్థానికులు పెద్దఎత్తున చేరుకున్నారు.
ప్రతి సంవత్సరం నిమజ్జనంరోజు వర్షం పడేది. గతంతో పోలిస్తే ఈసారి నిమజ్జనం రోజు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా వినాయకులను సాగనంపేందుకు, ఆ దృశ్యాలు చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు.
-
బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర కొనసాగుతుంది. చార్మినార్ వద్దకు శోభాయాత్ర చేరుకుంది.
-
ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర మహాగణపతి నిమజ్జనం పూర్తి. మహాగణపతిని వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
ఉదయం 6 గంటలకు మొదలైన గణనాథుడి శోభాయాత్ర. భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగింది.
-
షెడ్యూల్ ప్రకారం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి చేసిన పోలీసులు.
-
ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరారు. బైబై గణేశా అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
-
హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు.
కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
-
కొనసాగుతున్న బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర.
చాంద్రాయణగుట్టకు చేరుకున్న బాలాపూర్ గణపతి.
చార్మినార్, అప్జల్ గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా సాగనున్న శోభాయాత్ర
-
హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనాలు. భక్తులతో కిక్కిరిసిపోయిన ట్యాంక్‌బండ్ పరిసరాలు
-
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర పూర్తయింది. హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్ నెంబర్ 4 వద్దకు మహాగణపతి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో గంగమ్మ పూజ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత టాస్కర్ మీద ఉన్న భారీ విగ్రహానికి సిబ్బంది వెల్డింగ్ తొలిగించనున్నారు.
-
బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. రూ. 27లక్షలకు వేలంలో దాసరి దయానంద్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. దీంతో గతేడాది రూ. 24.60లక్షల ధరను ఈసారి అధిగమించింది.
Balapur Ganesh Laddu
-
వేలంపాటలో గతేడాది ధర (24.60లక్షలు) ను దాటేసిన బాలాపూర్ గణేశ్ లడ్డూ ధర
-
కొనసాగుతున్న బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట
-
తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
-
రికార్డు ధర పలికిన గణపతి లడ్డూ..
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిది కీర్తి రిచ్‌మండ్ విల్లాలోని గణపతి మండపం వద్ద లడ్డూ వేలంపాట జరిగింది. ఈ వేలంలో లడ్డూ రూ. 1.26 కోట్లు రికార్డు ధర పలికింది.
-
బాలాపూర్ గణపతి లడ్డూ విజేతలు వీరే..
1994 నుంచి బాలాపూర్ వినాయక ఉత్సవ సమితి లడ్డూ వేలంపాట (2020లో కరోనా కారణంగా లడ్డూవేలం జరగలేదు) నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా లడ్డూవేలం రూ.450తో ప్రారంభమైంది. ప్రతీయేటా వేలంపాట ధర పెరుగుతూ వచ్చింది. మొదటి నుంచి లడ్డూ వేలం వివరాలు ఇలా..
1994 - కొలను మోహన్ రెడ్డి రూ. 450
1995 - కొలను మోహన్ రెడ్డి రూ.4,500
1996 - కొలను కృష్ణారెడ్డి రూ.18 వేలు
1997 - కొలను కృష్ణారెడ్డి రూ.28 వేలు
1998 - కొలను మోహన్ రెడ్డి రూ.51 వేలు
1999 - కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ.65 వేలు
2000 -కొలన్ అంజిరెడ్డి రూ.66 వేలు
2001 - జి. రఘునందన్ రెడ్డి రూ.85 వేలు
2002 - కందాడ మాధవరెడ్డి రూ.1,05,000
2003 - చిగిరినాథ బాల్‌రెడ్డి రూ.1,55,000
2004 - కొలన్ మోహన్ రెడ్డి రూ.2,01,000
2005 - ఇబ్రహీ శేఖర్ రూ.2,08,000
2006 - చిగురింత తిరుపతి రెడ్డి రూ.3లక్షలు
2007 - జి. రఘునాథమ్ చారి రూ.4,15000
2008 - కొలన్ మోహన్ రెడ్డి రూ.5,07,000
2009 - సరిత రూ.5,10,000
2010 - కొడాలి శ్రీధర్ బాబు రూ.5,35,000
2011 - కొలన్ బ్రదర్స్ రూ.5,45,000
2012 - పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ.7,50,000
2013 - తీగల కృష్ణారెడ్డి రూ.9,26,000
2014 - సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ.9,50,000
2015 - కొలన్ మధన్ మోహన్ రెడ్డి రూ.10,32,000
2016 - స్కైలాబ్ రెడ్డి రూ.14,65,000
2017 - నాగం తిరుపతిరెడ్డి రూ.15,60,000
2018 - శ్రీనివాస్ గుప్తా రూ. 16,60,000
2019 - కొలను రామిరెడ్డి రూ.17 లక్షల 60 వేలు
2020 - కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు
2021 - మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18 లక్షల 90 వేలు
2022 - వంగేటి లక్ష్మారెడ్డి రూ. రూ.24 లక్షల 60 వేలు
-
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర లక్డీకపూల్ చౌరస్తా వద్దకు చేరుకుంది.
-
ఈసారి లడ్డూ వేలంలో నూతనంగా ఏడుగురు ..
బాలాపూర్ లడ్డూ వేలంలో ఈసారి కొత్తవారు పాల్గోనున్నారు. గతంలో పాల్గొన్న 29మందికి అదనంగా మరో ఏడుగురు కొత్తగా వేలంపాటలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో..
కళ్లెం రాఘవేందర్ రెడ్డి, సామ ప్రణీత్ రెడ్డి (అర్బన్ గ్రూప్ ఎల్బీనగర్)
బోర మధన్ రెడ్డి (సుల్తాన్ పూర్)
కొండపల్లి గణేష్ (గణేష్ రియల్ ఎస్టేట్స్ ఖమ్మం)
లింగాల దశరథ్ గౌడ్ (ఖర్మన్ ఘాట్)
దాసరి దయానంద్ రెడ్డి(తుర్కెంజాల్)
నవర్ శ్రీనివాస్ రెడ్డి (బాలాపూర్ గండికోట)
శ్రీశైలం (బాలాపూర్)
-
మరికొద్ది సేపట్లో బాలాపూర్ గణపతి లడ్డూ వేలంపాట ప్రారంభం.
-
భక్తజన సందోహం మధ్య ముందుకు కదులుతున్న ఖైరతాబాద్ మహాగణపతి.
ఖైరతాబాద్ శోభాయాత్రలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు. బ్యాండ్‌కి అనుమతి నిరాకరణ.
సాధాసీదాగా సాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.
ఆర్‌అండ్‌బి ఎస్టేట్ ఆఫీస్ వద్దకు చేరుకుంటున్న మహాగణపతి.
-
బుధవారం రాత్రి హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సమయంలో వర్షం వచ్చినా తడవకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 63అడుగుల ఎత్తయిన భారీ మట్టి విగ్రహం కావడంతో ముందస్తుగా పాలిథిన్ కవర్‌ను కప్పేశారు. మూడుసార్లు భారీ వర్షం కురిసినా విగ్రహం చెక్కు చెదరదు.
-
ఇవాళ పార్కుల మూసివేత
వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఈరోజు ట్యాంక్‌బండ్, పీవీ మార్గ్ పరిసరాల్లో ఉన్న పార్కులను మూసివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది.
-
ఖైరతాబాద్ ‘శ్రీ దశ మహా విద్యాగణపతి’ నిమజ్జన శోభాయాత్ర ఉదయం 6గంటలకు ప్రారంభమైంది.
బుధవారం అర్థరాత్రి చివరి కలశ పూజ జరిపి, గురువారం తెల్లవారు జామునే స్వామిని ట్రాలీపైకి ఎక్కించారు.
-
63అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువు ఉన్న ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేందుకు ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేశారు. 150 టన్నులను మోసే సామర్థ్యం కలిగిన 26టైర్ల ట్రాలీపై మహాగణపతి నిమజ్జనానికి తరలివెళ్తున్నారు.
-
ఉదయం 9గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట ప్రారంభం.
గతేడాది 24లక్షల60వేలు పలికిన బాలాపూర్ లడ్డూ.
ఈసారి మరింత ఎక్కువ ధర పలికే చాన్స్.
వేలం పాట అనంతరం ప్రారంభం కానున్న శోభాయాత్ర.
-
ఉదయం 9.30 గంటలకు క్రేన్ నంబర్ 4 వద్దకు మహా గణపతి చేరుకోనున్నారు.
క్రేన్ నంబర్ 4 వద్ద 10.30 గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది.
ఉదయం 11.30 నుంచి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది.
మధ్యాహ్నం 12గంటలలోపు నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు.
-
క్రేన్ నం.4 వద్దే మహాగణపతి నిమజ్జనం
ఖైరతాబాద్ గణనాథుడు శోభాయాత్ర ద్వారా ఎన్టీఆర్ మార్గ్‌లోని నిమజ్జన ఘాట్‌కు చేరుకుంటాడు. శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంటుంది. దశాబ్దాలుగా ఖైరతాబాద్ గణపతిని ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నం.4 వద్దే నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా స్వామివారి 63అడుగుల భారీ విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం చేయనున్నారు.
-
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రధాన ఊరేగింపు జరిగే బాలాపూర్ - హుస్సేన్ సాగర్ మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఈరోజు ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 10గంటల వరకు ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.
N O T I F I C A T I O N
In exercise of the powers conferred upon me under section 21 (1) (b) of Hyderabad City Police Act, I, C.V. Anand, I.P.S., Commissioner of Police, Hyderabad do hereby notify for the information of the general public...https://t.co/HGrcZ1PwT9 pic.twitter.com/IfCoy8FfHF— Hyderabad City Police (@hydcitypolice) September 27, 2023