MLA Rajasingh Increased Security : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చర్లపల్లి జైలులో భద్రత పెంపు

చర్లపల్లి జైల్లో ఉన్న హైదరాబాద్‌ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జైలు అధికారులు భద్రత పెంచారు. పీడీయాక్ట్ కేసులో రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్‌ను మానస బ్యారక్‌ నుంచి శారద బ్యారక్‌కు మార్చారు. అటు రాజాసింగ్‌ను కలిసేందుకు వచ్చినవారిని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు.

MLA Rajasingh Increased Security : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చర్లపల్లి జైలులో భద్రత పెంపు

MLA Rajasingh Increased Security

Updated On : September 2, 2022 / 7:22 PM IST

MLA Rajasingh Increased Security : చర్లపల్లి జైల్లో ఉన్న హైదరాబాద్‌ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జైలు అధికారులు భద్రత పెంచారు. పీడీయాక్ట్ కేసులో రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్‌ను మానస బ్యారక్‌ నుంచి శారద బ్యారక్‌కు మార్చారు. అటు రాజాసింగ్‌ను కలిసేందుకు వచ్చినవారిని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేసి అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి చర్లపల్లి జైల్లోనే ఉన్న రాజాసింగ్ ఓ పక్క తనపై బనాయించిన పీడీయాక్ట్ తొలగించుకునేందుకు..తన లాయర్ల ద్వారా యత్నిస్తున్నారు. మరోపక్క తనకు బీజేపీ అధిష్టానం నిర్ణయించిన గడువు పొడిగించుకునేందుకు రాజాసింగ్ యత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా రాజాసింగ్ లాయర్లు హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.

Khairatabad ganpati: ఖైరతాబాద్ గణేశ విగ్రహం వద్ద రాజాసింగ్ అనుచరుల ఆందోళన.. ఉద్రిక్తత

అలాగే బీజేపీ అధిష్టానం తనకు ఇచ్చిన గడువు పెంచుకోవటానికి రాజాసింగ్ తన భార్యను ఢిల్లీకి పంపించారు. పార్టీ లైన్ దాటారన్న అధిష్టానం నోటీసులపై వివరణ ఇచ్చేందుకు రేపటితో గడువు ముగియనుంది. రాజాసింగ్ జైల్లో ఉన్నందున వివరణ ఇచ్చేందుకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని రాజాసింగ్ భార్య అధిష్టానాన్ని కోరనున్నారు. బీజేపీ పెద్దలను మరికొంత గడువు ఇవ్వాలని కోరనున్నారు.