Jubilee Hills GangRape Issue : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. హోంమంత్రి మనవడికి క్లీన్ చిట్
ఈ కేసులో హోంమంత్రి మనవడికి క్లీన్ చిట్ ఇచ్చారు. అతడి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయంపైనా ఆధారాలు లేవన్నారు. (Jubilee Hills GangRape Issue)

Amnesia Pub Issue
Jubilee Hills GangRape Issue : సంచలనం రేపిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకి సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కీలక వివరాలు మీడియాకు తెలిపారు. ఈ కేసులో హోంమంత్రి మనవడికి డీసీపీ జోయల్ డేవిస్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు ఫరాన్ అహ్మద్ ప్రమేయం లేదని డీసీపీ స్పష్టం చేశారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయంపైనా ఆధారాలు లేవని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ రేప్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు మైనర్లు కావడంతో పోలీసులు వారి వివరాలను వెల్లడించలేదు. ఈ కేసులో ఓ ప్రముఖ వ్యక్తి కొడుకు ఉన్నట్లు సమాచారం ఉందని డీసీపీ తెలిపారు. ఆ ప్రముఖ వ్యక్తి కొడుకు మైనర్ కావడంతో అతడి వివరాలు వెల్లడించ లేదు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకరు తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు ఉన్నాడు. అతడు మైనర్ కావడంతో పోలీసులు అతడి పేరుని వెల్లడించ లేదు.(Jubilee Hills GangRape Issue)
ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని (మాజిద్, ఫరూక్) అరెస్ట్ చేశారు. వారిద్దరూ మేజర్లే. బాధితురాలు తన స్టేట్ మెంట్ లో సాజిద్ పేరుని వెల్లడించింది. దీంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ముందుగా సాజిద్ ని అరెస్ట్ చేశారు. తర్వాత అతడి స్నేహితుడు ఫారుక్ ని అరెస్ట్ చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు, మైనర్ అయిన నిందితుడిని పోలీసులు రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను (మైనర్లు) త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు.
MLA Raja Singh : వాహనాలు రేప్ చేశాయా? జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు
బాలిక రేప్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. విపక్షాలు అధికార పక్షాన్ని టార్గెట్ చేశాయి. నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నారని, వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కేసులో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనవడి ప్రమేయం ఉందని, పబ్ బుక్ చేసింది అతడే అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ కేసుపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ట్విట్టర్ లో స్పందించారు. ఈ ఘటన దారుణం అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మహమూద్ అలీ చెప్పారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చామని.. మంత్రి కేటీఆర్ ట్వీట్ కు రిప్లయ్ ఇచ్చారు మంత్రి మహమూద్ అలీ.(Jubilee Hills GangRape Issue)
మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు, వారిని కఠినంగా శిక్షించాలంటూ ట్విట్టర్ వేదికగా ఇటు హోంమంత్రిని, అటు డీజీపీని ఆదేశించారు మంత్రి కేటీఆర్.