Hyderabad MMTS Trains : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయి వర్క్ షాప్ కే పరిమితమయ్యాయి. సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వేవర్క్ షాప్ లో బోగీల చక్రాలకు

Hyderabad MMTS Trains : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

Hyderabad Mmts Trains

Updated On : June 22, 2021 / 11:08 AM IST

Hyderabad MMTS Trains : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయి వర్క్ షాప్ కే పరిమితమయ్యాయి. సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వేవర్క్ షాప్ లో బోగీల చక్రాలకు తాళాలు వేసి ఉంచారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో సిటీ బస్సులు, మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లు కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీంతో బుధవారం(జూన్ 23,2021) నుంచి పట్టాలెక్కనున్నాయి. మొదటి విడతగా లింగంపల్లి నుంచి ఫలక్ నుమా, ఫలక్ నుమా నుంచి లింగంపల్లి వరకు వీటిని నడపనున్నారు. ముందుగా 10 ఎంఎంటీఎస్ రైళ్ల‌ను న‌డ‌ప‌నున్నారు. క్ర‌మంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను పెంచ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఈ నెల 23 నుంచి హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్ల ను పునద్ధ‌రిస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు వెల్ల‌డించారు. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా గతేడాది మార్చి 23న ఎంఎంటీఎస్ రైళ్ల సేవ‌లు నిలిచిపోయాయి.

ఎంఎంటీఎస్‌లు నడపడానికి రైల్వే శాఖ అనుమతిచ్చింది. ఎంఎంటీఎస్‌ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన పీయూష్‌ గోయల్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

47154 Falaknuma 07.50 am Lingampalli 09.07 am
47178 Lingampalli 09.20 am Falaknuma 10.42 am
47157 Falaknuma 10.55 am Lingampalli 12.20 noon
47181 Lingampalli 12.40 pm Falaknuma 2 pm
47162 Falaknuma 4.20 pm Lingampalli 5.45 pm
47188 Lingampalli 6.05 pm Falaknuma 7.32 pm
47131 Lingampalli 08.43 am Hyderabad 09.28 am
47107 Hyderabad 09.36 am Lingampalli 10.21 am
47141 Lingampalli 5.15 pm Hyderabad 6.05 pm
47119 Hyderabad 6.15 pm Lingampalli 7.05 pm