తెలంగాణ భవన్‌లో జెండా ఎగురవేసిన కేటీఆర్

తెలంగాణ భవన్‌లో జెండా ఎగురవేసిన కేటీఆర్

Updated On : September 17, 2019 / 6:07 AM IST

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17 భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన సందర్భంగా వీరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. జెండా వందనం తర్వాత ఆయన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

కేటీఆర్ చేసిన ట్వీట్‌లో ‘హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయిన నేడు. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం. జై తెలంగాణ, జై హింద్’ అని ట్వీట్ చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల సమక్షంలో జెండా వందన కార్యక్రమం జరిగింది.