Mynampally Hanumanth Rao : సెప్టెంబర్ 27న కాంగ్రెస్ పార్టీలో చేరతా : ఎమ్మెల్యే మైనంపల్లి

రాష్ట్ర, జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరుతానని పేర్కొన్నారు. హైకమాండ్ అదేశానుసారం హన్మంతరావును పార్టీలోకి ఆహ్వానించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

Mynampally Hanumanth Rao : సెప్టెంబర్ 27న కాంగ్రెస్ పార్టీలో చేరతా : ఎమ్మెల్యే మైనంపల్లి

Mynampally Hanumanth Rao (1)

Updated On : September 25, 2023 / 2:18 PM IST

Mynampally Hanumanth Rao – Congress Party : తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. సెప్టెంబర్ 27న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పారు. రాష్ట్ర, జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరుతానని పేర్కొన్నారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి రాజీనామా చేశారు.

హైకమాండ్ అదేశానుసారం హన్మంతరావును తమ పార్టీలోకి ఆహ్వానించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. హన్మంతరావు, వారి కుమారుడు రోహిత్ రావు, నక్క ప్రభాకర్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వారితో  జరిపిన చర్చలు ఫలించాయని చెప్పారు.

Also Read: వ్యూహాల‌కు ప‌దునుపెడుతోన్న కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి వల!

కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 27న తమ పార్టీ అగ్రనాయకుల సమక్షంలో పార్టీలో చేరుతారని వెల్లడించారు. టికెట్ల అంశం సమస్య కాదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరలేదన్నారు. సోమవారం దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, హనుమంతరావు
తదితరులు భట్టివిక్రమార్క వెంట ఉన్నారు.