G Kishan Reddy : దమ్ము, ధైర్యం ఉంటే 50లక్షల ఇళ్లు కట్టు- సీఎం కేసీఆర్‌‌కు కిషన్ రెడ్డి సవాల్, బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారుగా..

సీఎం కేసీఆర్ పోలీసులను పెట్టుకొని పాలన చేస్తున్నారు. యుద్ధం మొదలైంది కేసీఆర్. కేంద్ర మంత్రినే అరెస్ట్ చేస్తారా? G Kishan Reddy

G Kishan Reddy : దమ్ము, ధైర్యం ఉంటే 50లక్షల ఇళ్లు కట్టు- సీఎం కేసీఆర్‌‌కు కిషన్ రెడ్డి సవాల్, బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారుగా..

G Kishan Reddy

Updated On : July 20, 2023 / 2:41 PM IST

G Kishan Reddy – CM KCR : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఎన్నికలకు అన్ని పార్టీలు కసరత్తు షురూ చేశాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. దమ్ము, ధైర్యం ఉంటే 50లక్షల ఇళ్లు కట్టు అని కేసీఆర్ కు సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. అదే సమయంలో కేసీఆర్ కు కిషన్ రెడ్డి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. 50లక్షల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెచ్చే బాధ్యత నాది అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read..Tandur Constituency: బీఆర్‌ఎస్‌లో హీట్ పుట్టిస్తున్న తాండూరు పాలిటిక్స్.. కాంగ్రెస్, బీజేపీ ప్లానేంటి?

”గృహనిర్బంధాలు ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఎందుకు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లడానికి బయల్దేరుతుంటే అడ్డుకొని అరెస్ట్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడి వరకు వచ్చాయి? మొండి గోడలు తప్ప మరేమీ లేవు. కేసీఆర్ కుటుంబం భయంలో ఉంది.

మీరు 4 నెలల్లో ఇల్లు కట్టుకున్నారు కదా మరి పేదలకు కట్టివ్వరా? బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో కట్టుకోలేదా? అడుగడుగునా ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని చెప్పే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేస్తారా? తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు.

Also Read..Raghunandan Rao: పిల్లలు స్కూల్ కు వెళ్లిన తర్వాత సెలవు ప్రకటిస్తారా.. ధన్యవాదాలు అంటూ సెటైర్లు

సీఎం కేసీఆర్ పోలీసులను పెట్టుకొని పాలన చేస్తున్నారు. డబ్బా రూముల్లో ఎట్లా ఉంటారని చెప్పిన కేసీఆర్ ఎక్కడున్నారు? యుద్ధం మొదలైంది. యుద్దానికి మేము సిద్ధమే. యుద్ధం వాళ్ళు మొదలు పెట్టారు. శాంతియుతంగా చేస్తాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం, పోడు భూముల కోసం, నిరుద్యోగుల కోసం, రేషన్ కార్డుల కోసం, నిరుద్యోగ భృతి కోసం యుద్ధం చేస్తాం. యుద్ధం మొదలైంది కేసీఆర్. కేంద్ర మంత్రినే అరెస్ట్ చేస్తారా? పోరాటాలతో వచ్చాం. పార్టీలు మారి రాలేదు. బీర్ఎస్ పాపాలు పండాయి” అని నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి.