Telangana : తెలంగాణలో హైఅలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
10 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వానలు పడే అవకాశం ఉందంది. Telangana Rains

Telangana Rains
Telangana Rains : తెలంగాణ రాష్ట్రాన్ని వానలు వెంటాడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా తయారైంది. గ్యాప్ లేకుండా పడుతున్న జోరు వానలతో జనం బేజారు అవుతున్నారు. తాజాగా రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం.
తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలర్డ్, 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 10 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వానలు పడే అవకాశం ఉందంది.
ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని చెప్పింది.
భారీ వర్షపాతం నమోదు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా పర్వతగిరిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. రేపు కూడా తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.