KCR: కేసీఆర్‌ విచారణలో కీలక మార్పులు..! ఇన్‌ కెమెరా ముందు కాళేశ్వరం కమిషన్‌ విచారణ‌..!

కమిషన్ అడిగే ప్రశ్నలకు ఇన్ కెమెరా సమాధానం చెప్పనున్నారు కేసీఆర్.

KCR: కేసీఆర్‌ విచారణలో కీలక మార్పులు..! ఇన్‌ కెమెరా ముందు కాళేశ్వరం కమిషన్‌ విచారణ‌..!

KCR

Updated On : June 10, 2025 / 8:02 PM IST

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు ఓపెన్ కోర్టులో సాగిన విచారణ రేపు (జూన్ 11) మాత్రం ఇన్ కెమెరా విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. రేపు కమిషన్ ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్.. ఇన్ కెమెరా విచారణకు హాజరుకానున్నారు. ఇన్ కెమెరా ముందే విచారణలో పాల్గొనున్నారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు ఇన్ కెమెరా సమాధానం చెప్పనున్నారు కేసీఆర్. అటు కమిషన్ అడిగే ప్రశ్నలకు మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెబుతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రేపు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. రేపు కేసీఆర్ హాజరుకాబోతున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో కమిషన్ కీలక మార్పులు చేసింది. కాళేశ్వరం కమిషన్ విచారణ మొదలైనప్పటి నుంచి నిన్నటి వరకు ఓపెన్ కోర్టులోనే ఎంక్వైరీ జరిగింది.

Also Read: వామ్మో.. ఇలా కూడా మోసం చేస్తారా..! నకిలీ కోర్టు సృష్టించి.. నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి కోటిన్నర కొట్టేశారు..

ఇద్దరు ప్రజాప్రతినిధులతో పాటు దాదాపు 115 మందిని అప్పటివరకు కమిషన్ విచారించింది. మొత్తం విచారణ ప్రక్రియ ఓపెన్ కోర్టులోనే చేసింది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కావడంతో కొంత ప్రొటోకాల్ ఉన్న నేపథ్యంలో ఇన్ కెమెరాలో విచారించాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయం తీసుకుంది.