Income Tax Raid: విచారణకు రండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీకి ఐటీ అధికారుల నోటీసులు

ఐటీ అధికారుల విచారణకు మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మంగళవారం హాజరు కానున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి‌ని గురువారం విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Income Tax Raid: విచారణకు రండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీకి ఐటీ అధికారుల నోటీసులు

BRS MLAs and MP

Updated On : June 20, 2023 / 10:24 AM IST

Income Tax Raid: ఇటీవల మూడు రోజులుపాటు తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇళ్లలో, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు (IT officials search) నిర్వహించిన విషయం తెలిసింది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (MP Kotha Prabhakar Reddy) నివాసంలో ఒకరోజు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి (Shekhar Reddy) , మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడు రోజులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా పలు డాక్యుమెంట్లు, కంపెనీల వివరాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వివరాలను సేకరించారు. మూడు రోజులు సాగిన ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు.

BRS MLA Shekhar Reddy: తొలిరోజు గంటన్నరలోనే ఐటీ దాడులు పూర్తయ్యాయి.. కావాలనే మూడు రోజులు చేశారు..

సోదాల అనంతరం ముగ్గురు నేతలకు నోటీసులు ఇచ్చారు. సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్‌లోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఐటీ అధికారుల పిలుపు మేరకు మంగళవారం మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఐటీ అధికారుల ముందు హాజరు కానున్నారు. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డిని గురువారం విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే ఐటీ అధికారుల సోదాల అనంతరం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

BRS MLA Shekhar Reddy: తొలిరోజు గంటన్నరలోనే ఐటీ దాడులు పూర్తయ్యాయి.. కావాలనే మూడు రోజులు చేశారు..

ఐటీ రైడ్స్ మొదటి రోజు ఒక గంటన్నరలోనే పూర్తయ్యాయి. కావాలనే మూడు రోజులు కాలయాపన చేశారంటూ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖరరెడ్డి ఆరోపించారు. నాకు విదేశాలలో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయనేది వాస్తవం కాదని చెప్పారు. ఐటీ అధికారులకు నేను పూర్తిగా సహకరించాను. నాపై కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా ఈ ఐటీ దాడులు జరిగాయని ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేను 1998 నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. నాకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవని చెప్పారు. ఐటీ అధికారులకు వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో నిరుత్సాహం‌తో వెనుదిరిగి వెళ్లిపోయారని శేఖర్ రెడ్డి అన్నారు. తనకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారని, విచారణలో భాగంగా ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నానని శేఖర్ రెడ్డి తెలిపారు.