Bandi Sanjay : బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్? అందుకోసమేనా

బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు(20వరకు) వచ్చేవి, అప్పుడు తెలంగాణలో చాలా కీలకంగా మారేవాళ్లం అనే అభిప్రాయం చాలామంది బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. కాబట్టి బండి సంజయ్ ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించి లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Bandi Sanjay : బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్? అందుకోసమేనా

Bandi Sanjay Kumar

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ ఫలితాలపై సమీక్ష మొదలు పెట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించడమే ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంగా భావిస్తున్న కమలదళం.. రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్ ని పునర్ నియమించనున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలలోగా బండికి పార్టీ పగ్గాలు అప్పగించి సార్వత్రిక సమరంలో సత్తా చాటాలనే పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది కాషాయ పార్టీ.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు మళ్లీ బండి సంజయ్ కి అప్పగించనున్నారా? ఇప్పుడీ అంశం బీజేపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి స్థానంలో అధ్యక్ష బాధ్యతలను బండి సంజయ్ కి అప్పగించనున్నారని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల వరకే తాను అధ్యక్షుడిగా ఉంటానని కిషన్ రెడ్డి చెప్పారు. అందుకు బీజేపీ హైకమాండ్ కూడా ఓకే చెప్పింది.

త్వరలో పార్లమెంటు ఎన్నికలు..
ఇక త్వరలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటారని, ఆయన స్థానంలో మళ్లీ బండి సంజయ్ కి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గౌరవప్రదమైన సీట్లు వచ్చినప్పటికీ.. బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. కేవలం 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి.

Also Read : దివ్యాంగురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే..

బండి సంజయ్ ఉండి ఉంటే 20సీట్లు వచ్చేవి..!
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు(20వరకు) వచ్చేవి, అప్పుడు తెలంగాణలో చాలా కీలకంగా మారేవాళ్లం అనే అభిప్రాయం చాలామంది బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. కాబట్టి బండి సంజయ్ ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించి లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం
లోక్ సభ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి రావాలంటే తెలంగాణలోనూ ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి నాలుగు సీట్లే ఉన్నాయి. ఆ సంఖ్యను 8కి పెంచాల్సి ఉంటుంది. అసెంబ్లీలో 8 సీట్లు ఉన్నట్లు లోక్ సభలోనూ 8 సీట్లకు సంఖ్య పెరగాలంటే బండి సంజయ్ వస్తేనే సాధ్యం అంటూ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మళ్లీ బండి సంజయ్ కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది.

Also Read : కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఆర్నెళ్లే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

అధ్యక్ష పదవి రేసులో మరో పేరు..
అటు మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేరు కూడా రాష్ట్ర అధ్యక్షుడి రేసులో వినిపిస్తోంది. ఆయనను అధ్యక్షుడిని చేసే అవకాశం లేకపోలేదు అని సమాచారం. ఇద్దరూ కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలే. బీసీ సీఎం అనే నినాదం కూడా బీజేపీ తీసుకుంది. కాబట్టి బండి సంజయ్ లేదా లక్ష్మణ్.. ఈ ఇద్దరిలో ఒకరికి మళ్లీ అధ్యక్ష పదవి అవకాశం దక్కబోతోందని తెలుస్తోంది.

బండి సంజయ్ ఎక్కువ అవకాశాలు.. ఎందుకంటే..
ఇద్దరిలో బండి సంజయ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్ కు యూత్ లో ఫాలోయింగ్ ఉంది. పార్టీ సమర్ధవంతంగా నడిపించారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొన్నారు. ఒక దశలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ, అధికారంలోకి వస్తుంది అనే చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత బండి సంజయ్ తొలగింపుతో బీజేపీ బలహీనపడింది అనేది వాస్తవం అంటున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

Also Read : ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం ముందుకు వచ్చిన కేసీఆర్.. వీడియో వైరల్

కాగా, బండి సంజయ్ ను తొలగించడానికి ఈటల రాజేందర్ ప్రధాన కారణం అని, తెరవెనుక చక్రం తిప్పారు అనే అభిప్రాయం ఆ పార్టీలోని చాలామందిలో వ్యక్తమైంది. ఈ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతోనే (3వేలు) ఓటమిపాలయ్యారు బండి సంజయ్. కరీంనగర్ నుంచి బరిలోకి దిగిన బండి సంజయ్ గంగుల కమలాకర్ చేతిలో పరాజయం చూశారు. గంగుల కమలాకర్ చాలా స్ట్రాంగ్ లీడర్. ఆర్థికపరంగా బలమైన నాయకుడు. అలాంటి చోట స్వల్ప ఓట్ల తేడాతోనే బండి సంజయ్ ఓడిపోయారు. కాబట్టి బండి సంజయ్ అక్కడ గెలిచినట్లే భావిస్తున్నాయి బీజేపీ శ్రేణులు. ఇక ఈటల రాజేందర్ ను చూసుకుంటే.. ఆయన 20ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ లో ఈసారి ఓడిపోయారు. దీంతో పార్టీ పరంగా చూసుకుంటే ఈటల రాజేందర్ కొంత బలహీనపడ్డట్టు అర్థమవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరొకసారి బండి సంజయ్ కి ఎలివేషన్ ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.