Jeevan Reddy: చంద్రబాబు నాయుడి వారసత్వ పార్టీ బీఆర్ఎస్.. ఇప్పుడేమో..: జీవన్ రెడ్డి

కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాడు చంద్రబాబు పక్కన లేరా అని నిలదీశారు.

Jeevan Reddy: చంద్రబాబు నాయుడి వారసత్వ పార్టీ బీఆర్ఎస్.. ఇప్పుడేమో..: జీవన్ రెడ్డి

T Jeevan Reddy

Updated On : July 17, 2023 / 2:31 PM IST

Jeevan Reddy – KTR: బీఆర్ఎస్ (BRS) పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వారసత్వ పార్టీ అని కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల (Jagtial) జిల్లాలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. చంద్రబాబు నాయుడి ఆలోచనలతోనే బీఆర్ఎస్ నడుస్తుందని ఆరోపించారు.

కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాడు చంద్రబాబు పక్కన లేరా అని నిలదీశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు విద్యుత్ రిఫరెండంపైనేనని అన్నారు. తెలంగాణలో ఉచిత విద్యుత్ కింద గత 6 నెలలుగా ఎన్ని గంటలు విద్యుత్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ టీడీపీ నుంచే వచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి గురించి చరిత్ర తెలుసుకుని కేటీఆర్ మాట్లాడాలని చెప్పారు. కేసీఆర్ కు అప్పట్లో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. కేసీఆర్ కు అసలు తెలంగాణ ఉద్యమం గుర్తువచ్చేదా? అని అన్నారు. ఉచిత విద్యుత్ పథకన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.

అప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నారని జీవన్ రెడ్డి అడిగారు. రైతులకు ఇప్పటి వరకు విత్తన రాయితీ, వడ్డీ మాఫీ లేదని చెప్పారు. ఉచిత విద్యుత్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనేత్తగానే రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాత్రి పూట నిరంతర విద్యుత్ ను అందిస్తుందని అన్నారు. ఉచిత విద్యుత్ పై వాస్తవాలను వక్రీకరిస్తున్నారని చెప్పారు.
Pawan Kalyan : జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్.. తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న పవన్ కళ్యాణ్