గద్వాల్ తేజేశ్వర్ హత్యకేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ప్రియుడితో కలిసి పెద్ద స్కెచ్చే వేసిన భార్య

తేజేశ్వర్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని ఐశ్వర్య భావించింది. ఈ క్రమంలోనే ప్రియుడు తిరుమలరావుతో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది.

గద్వాల్ తేజేశ్వర్ హత్యకేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ప్రియుడితో కలిసి పెద్ద స్కెచ్చే వేసిన భార్య

Jogulamba Gadwal Tejaswar Case

Updated On : June 24, 2025 / 1:03 PM IST

Jogulamba Gadwal Tejaswar Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలోనే.. గద్వాల జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య జరగడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే ప్రియుడితో కలిసి భార్య ఐశ్వర్య భర్తను హత్య చేయించింది. ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు.. ఐశ్వర్య సహా ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: ఓ జీపీఎస్ ట్రాకర్.. 2వేల కాల్స్.. ఓ మర్డర్.. గద్వాల తేజేశ్వర్ కేసులో సంచలన విషయాలు..

తేజేశ్వర్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని ఐశ్వర్య భావించింది. ఈ క్రమంలోనే ప్రియుడు తిరుమలరావుతో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే భర్తను హత్యచేసేందుకు రూ.75వేలు సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రియుడు తిరుమలరావుతో కలిసి ఉండాలనే మోజుతోనే ఐశ్వర్య తేజేశ్వర్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బ్యాంకు మేనేజర్ తిరుమలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను రాబట్టేందుకు గద్వాల పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం ఏడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. సుపారీ కాంట్రాక్టు తీసుకున్న బ్రోకర్, కారు డ్రైవర్, భార్య ఐశ్వర్య, అత్త సుజాత, బ్యాంకు మేనేజర్ తిరుమలరావుసహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.