Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్.. షెడ్యూల్ ఖరారు..
కాంగ్రెస్ తరపున ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సీఎం ప్రచార షెడ్యూల్ ను హస్తం పార్టీ నేతలు ఖరారు చేశారు. నాలుగు రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. ఈ నెల 28న పోలీస్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్టోబర్ 30, 31, నవంబర్ 4, 5వ తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ తరపున ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి రోజు మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించేలా ప్లాన్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు నేరుగా సీఎం రేవండ్ రెడ్డి ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసింది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు కవర్ అయ్యేలా సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేశారు.
అక్టోబర్ 30, 31న రెండు రోడ్ షోలు.. నవంబర్ 4, 5 తేదీల్లో మరో రెండు రోడ్ షోలు ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. నెల రోజులకు పైగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ లకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. మిగతా మంత్రులకు సైతం ప్రచార బాధ్యతలు అప్పగించింది.
ఇప్పటికే మంత్రి సీతక్క ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అని వారంతా ధీమా వ్యక్తం చేశారు. మరో మంత్రి వాకిటి శ్రీహరి సైతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నారు. దాదాపు 18 కార్పొరేషన్ ఛైర్మన్లకు సైతం ప్రచారం బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. యాక్టివ్ గా ఉండే కొందరు ఎమ్మెల్యేలకు సైతం జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతలు అప్పగించారు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహ రచనలు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 150 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేస్తారు అనేదానిపై సీఎం రేవంత్ మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: తెలంగాణ మంత్రుల పంచాయితీపై అధిష్టానం ఆరా.. వరుస పరిణామాలపై ఏం జరిగిందంటే?
