Munugode By poll..KA paul : మునుగోడు ఎన్నిక వాయిదా వేయాలని హైకోర్టులో పిల్ వేశాం..సుప్రీంకోర్టులో కూడా వేస్తాం : కేఏ పాల్
మునుగోడు ఉప ఎన్నిక వాయిదా వేయాలని హైకోర్టులో పిల్ వేశామని ..సుప్రీంకోర్టులో కూడా పిటీషన్ వేస్తామని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తెలిపారు.

Munugode By poll KA paul
Munugode By poll KA paul : మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం ఇటు అధికార టీఆర్ఎస్, అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా కసరత్తులు చేస్తున్నాయి. ఈక్రమంలో మునుగోడులో ఈ మూడు పార్టీలతో పాటు కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ కూడా పోటీలో నిలబడతామని తెలిపింది. ఇటీవలే ప్రజాశాంతి పార్టీలో చేరిన ప్రజాగాయకుడు గద్దర్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈక్రమంలో కేఏ పాల్ సీఈవోకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఫిర్యాదు చేశారు.
నామినేషన్లకు ముందే ఈ మూడు పార్టీలు కోట్లాది రూపాలు వెదజల్లుతున్నారని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ డబ్బులు..బహుమతులు పంచుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై కేఏ పాల్ మాట్లాడుతూ..అంతేకాదు మునుగోడు ఉప ఎన్నిక వాయిదా వేయమని కోరుతు తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశామని త్వరలో సుప్రీంకోర్టులో కూడా పిటీషన్ వేస్తామని తెలిపారు.