కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం… కేసీఆర్, హరీశ్, ఈటలకు ఊరట
కాళేశ్వరంపై కమిషన్ నివేదికను సిద్ధం చేస్తోంది.

కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. కాళేశ్వరంపై కమిషన్ నివేదికను సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరున ప్రభుత్వానికి ఈ నివేదిక అందనుండడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు ఊరట దక్కింది.
బహిరంగ విచారణకు రాజకీయ నాయకులకు పిలవొద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. లీగల్ సమస్యలు రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది.
దాదాపు 400 పేజీల రిపోర్టును తయారు చేసింది. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా పలువురు అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్‌కు ఇచ్చిన గడువును మే 31 వరకు ఇప్పటికే రాష్ట్ర సర్కారు పొడిగించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై ఈ కమిషన్‌ను ఫిబ్రవరిలో వేశారు. అప్పట్లో 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు చెప్పింది. నివేదిక సిద్ధం కాకపోవడంతో ఈ గడువును పొడిగించింది.