Kavitha New Party: కవిత కొత్త పార్టీ పేరు ఇదే.. జెండా గుర్తులు ఇవే.. సీఎం అయ్యి తీరుతా అంటూ..
Kavitha New Party: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును మరికొద్ది సేపట్లో ప్రకటించనున్నారు.
Kavitha New Party
Kavitha New Party: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును మరికొద్ది సేపట్లో ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో కవిత పాల్గొన్నారు. ఈ సభావేదికగా కొత్త పార్టీని, పార్టీ జెండాను కవిత ఆవిష్కరించనున్నారు. అనంతరం ఎజెండాపై గంటన్నర పాటు కవిత ప్రసంగించనున్నారు.
శనివారం ఉదయం మేడ్చల్ లోని సభా ప్రాంగణానికి బయలుదేరే ముందు తన నివాసం వద్ద కవిత తన భర్త, కటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి గన్‌పార్కు వద్దకు చేరుకొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా మునీరాబాద్‌లోని సభా ప్రాంగణం వద్దకు బయలుదేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని.. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని కవిత దీమా వ్యక్తం చేశారు.
కవిత కొత్త పార్టీకి సంబంధించి పలు రకాలు పేర్లు వినిపించాయి. ప్రచారంలో తెలంగాణ రాష్ట్రీయ సమితి (TRS), తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ(TPJP), తెలంగాణ ప్రజా వికాస్ సమితి(TPVS) పేర్లు ఉన్నాయి. అయితే, కవిత ఏ పేరును ప్రకటిస్తారని తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు.. నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులతో పార్టీ జెండా ఉంటుందని తెలుస్తోంది. బ్లూ కలర్ బడుగు, బలహీన వర్గాల సూచిక, గ్రీన్ పాడి పంటలు రైతులు అంశానికి సూచిక, పసుపు కలర్ శుభసూచకంగా పార్టీ జెండా ఉంటుందని, పార్టీ జెండాలో తెలంగాణ మ్యాప్ ఉంటుందని చెబుతున్నారు.
