Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు..
అటు అజారుద్దీన్ ని క్యాబినెట్ లోకి తీసుకోవడం, ఇటు నామినేటెడ్ పదవులను కట్టబెట్టడం, సుదర్శన్ రెడ్డికి ఏకంగా క్యాబినెట్ హోదా ఉన్న అడ్వైజర్ పదవి కట్టబెట్టడం..
 
                            
Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. క్యాబినెట్ హోదాతో నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావును నియమించింది. వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు కూడా మంత్రి పదవిని ఆశించారు.
ఇప్పటికే మంత్రివర్గంలోకి అజారుద్దీన్ ని తీసుకుంది ప్రభుత్వం. మంత్రి పదవులు ఆశిస్తున్న మరికొందరు ఎమ్మెల్యేలకు తాజాగా నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది ప్రభుత్వం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్ గా సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కు నామినేటెడ్ పదవి లభించింది. సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
అటు అజారుద్దీన్ ని క్యాబినెట్ లోకి తీసుకోవడం, ఇటు నామినేటెడ్ పదవులను కట్టబెట్టడం, సుదర్శన్ రెడ్డికి ఏకంగా క్యాబినెట్ హోదా ఉన్న అడ్వైజర్ పదవి కట్టబెట్టడం లాంటి అంశాలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవులు ఆశించారు. అయితే, వారికి ఆ పదవులు దక్కలేదు. ఈ క్రమంలో వారిని బుజ్జగించేందుకు ఈ నామినేటెడ్ పదవులు కట్టబెట్టినట్లు చర్చ జరుగుతోంది.
Also Read: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఉత్కంఠ.. పిటిషన్లపై విచారణకు గడువు కోరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్






