సికింద్రాబాద్‎లో ఉద్రిక్తత.. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం

అక్కడకు పలువురు నేతలు, హిందూ సంఘాలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

సికింద్రాబాద్‎లో ఉద్రిక్తత.. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం

Updated On : October 14, 2024 / 11:53 AM IST

Kishan Reddy: సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడకు పలువురు నేతలు, హిందూ సంఘాలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేశ్ పరిశీలించారు. మొదట టెంపుల్ వద్దకు వచ్చిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. గణేశ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నాయకురాలు మాధవీలత కూడా దేవాలయాన్ని పరిశీలించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడకు చేరుకుని దేవాలయాన్ని పరిశీలించి మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. కొందరు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హిందూ దేవాలయాలపై, విగ్రహాలపై దాడి చేసిన వారు దొంగతనాలు చేయడానికి వచ్చారని, మరికొంతమంది మతిస్థిమితం లేకుండా దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు.

నగరంలో హిందూ పండుగలు జరుగుతున్న వేళ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత డీజేలు సౌండ్ సిస్టం పెడితే పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మరి వారు విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు జరిగితే ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా అరెస్టు చేసి వారి వెనుక ఎవరెవరి హస్తము ఉందో గుర్తించాలని డిమాండ్ చేశారు.

సిద్ధిఖీ హత్య కేసు: మైనర్‌నని చెప్పుకున్న నిందితుడు ధర్మరాజ్‌కు బోన్ ఆసిఫికేషన్ టెస్ట్.. ఏం తేలిందో తెలుసా?