Kodanda Reddy : వారికే టికెట్ ఇవ్వాలి.. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం కోదండ రెడ్డి సూచనలు
పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్‌కు కనీసం 3 టికెట్లు ఇవ్వాలని తెలిపారు.

Congress Leader Kodanda Reddy
Kodanda Reddy Suggestions : కాంగ్రెస్ సీటు కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. దాదాపు వెయ్యి దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. పీఈసీ దరఖాస్తులను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం పలు సూచనలు చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు టికెట్ కేటాయింపుపై చర్చలు జరుగుతున్న సందర్భంలో కొదండ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. టికెట్ కేటాయింపు కోసం ఉదయపూర్ డిక్లరేషన్‌ను ఫ్రేమ్‌వర్క్‌గా ఉపయోగించాలన్నారు.
గత ఎన్నికల్లో మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఓడిపోయిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వకూడదని తెలిపారు. తెలంగాణాలో 2018 శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీల నుండి పోటీ చేసిన వారికి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్లు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, ఇతర పార్టీల అభ్యర్థులకు పారాచూట్‌లో వచ్చిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకూడదని రాహుల్ గాంధీ అనేక సమావేశాల్లో చెప్పారు అని గుర్తు చేశారు.
Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో హాట్‌హాట్‌గా మారిన ఫ్యామిలీ పాలిటిక్స్!
పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్‌కు కనీసం 3 టికెట్లు ఇవ్వాలని తెలిపారు. పార్టీలో ఇటీవల చేరిన పొంగులేటి శ్రీనివాస్ లాంటి ఒకరిద్దరికి తప్పా కొత్తగా చేరిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదని చెప్పారు.
పీసీసీ ఎన్నికల కమిటీ ముందు పెట్టిన జాబితా లోపాలతో నిండి ఉందని పేర్కొన్నారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తులను పూర్తిగా తిరస్కరించాలన్నారు. ఇతర పార్టీలు తమ దరఖాస్తును తిరస్కరించినందున పార్టీలో చేరిన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికకు పరిగణించకూడదని చెప్పారు.
పీఈసీలో కనీసం 50 శాతం మందైనా టికెట్ ఆశించనివారు ఉండాలన్నారు. పీఈసీ సభ్యులు ఆశావాహులుగా ఉంటే వారికి వారు మద్దతు ఇచ్చుకుంటారని, తద్వారా ఎంపిక ప్రజాస్వామికంగా జరగదన్నారు. పై సూచనలను సీరియస్‌గా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు.