Kodandaram Calls For Protests : ప్రభుత్వంపై కోదండరామ్ ఫైర్.. ఆందోళనలకు పిలుపు

ఉద్యమ ఫలాలు తప్ప ఉద్యమ ఆకాంక్షలు అవసరం లేదు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధరల పెరుగుదల పేదలపై..

Kodandaram Calls For Protests : ప్రభుత్వంపై కోదండరామ్ ఫైర్.. ఆందోళనలకు పిలుపు

Kodandaram Calls For Protests

Updated On : April 23, 2022 / 5:05 PM IST

Kodandaram Calls For Protests : తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ అధినేత కోదండరామ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యమ ఫలాలు తప్ప ఉద్యమ ఆకాంక్షలు అవసరం లేదు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగ ప్రకటన చేసి నెల దాటినా ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ వేయలేదన్నారు.

ధరల పెరుగుదల పేదలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ కేంద్రంగా కాంట్రాక్టర్ల కమీషన్ దందా నడుస్తోందని కోదండరాం ఆరోపించారు. కాంట్రాక్టర్లకు టోకెన్ వ్యవస్థను అమలు చేయాలన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ నెల 25, 26 తేదీల్లో ఆందోళనలకు పిలుపునిస్తున్నామన్నారు.

GVL Narasimha Rao : కేంద్ర పథకాలకు మీ స్టిక్కర్ వేసుకుంటే ఊరుకునేది లేదు-జీవీఎల్ నరసింహారావు

రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. నీళ్లను సాధించడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. మే 4 నుంచి కృష్ణా జలాల సాధన యాత్ర చేస్తామని ప్రకటించారు.

Minister gangula: తెలంగాణపై కిషన్ రెడ్డి విషం చిమ్ముతుండు.. ఒక్క గింజకూడా పక్కదారి పట్టదు..

మరోవైపు ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ వేధింపుల వల్లే సాయి గణేష్ అత్మహత్య చేసుకున్నాడని ఆరోపించిన కోదండరామ్.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి పువ్వాడ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 29న జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు కోదండరామ్.