Komatireddy Rajagopal Reddy : బెల్ట్ షాపులు మూసివేయాలి.. ఇది మునుగోడు నుంచే మొదలవ్వాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బెల్టు షాపులు మూసివేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బెల్ట్ సాపులు మూసివేయటంలో రాజి పడేదిలేదని స్పష్టంచేశారు.

Komatireddy Rajagopal Reddy : బెల్ట్ షాపులు మూసివేయాలి.. ఇది మునుగోడు నుంచే మొదలవ్వాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

munugodu MLA Komatireddy Rajagopal Reddy : మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలంలోని 26 గ్రామాల ముఖ్య నాయకులతో బెల్ట్ షాపులు మూసివేత, గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..బెల్ట్ షాపుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటామని మద్యానికి బానిసలైన ఎన్నో కుటుంబాలు నాశమవుతున్నాయని అన్నారు.

మద్యపానానికి వ్యతిరేకతం కాదు కానీ ఎక్కడబడితే అక్కడ దొరకడం వల్ల చాలామంది జీవితాలు నాశనమవుతున్నాయని అన్నారు. మరీ ముఖ్యంగా మద్యం వల్ల యువత చెడిపోతున్నారని వారి భవిష్యత్తు నాశమవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.చట్ట ప్రకారం బెల్ట్ షాపులు నిషేధమన్నారు.గ్రామాలలో నాయకులు అందరూ ఏకమై బెల్టు షాపు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.బెల్ట్ షాపుల్ని బంద్ చేయించాల్సిన బాధ్యత మీ అందరిపైనా ఉందన్నారు. ఇది రాజకీయాలతో సంబంధంలేని అంశమని..నా పదవి పోయినా ఫరవాలేదు. కానీ బెల్ట్ సాపులు మాత్రం మూసివేయాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో రాజి పడేదిలేదని స్పష్టంచేశారు.బెల్ట్ షాపులు మూసి వేయడం గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత అని సూచించారు.

Singareni Elections : సీఎం పక్కన కూర్చునైనా సంతకం పెట్టిస్తా.. మీ సమస్యలు తీరుస్తా : సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి హామీ

బెల్ట్ షాపులు మూసివేసే ప్రయత్నంలో నాతోపాటు నడిచిన వాళ్లకే ప్రాముఖ్యతనిస్తానన్నారు.తాను తీసుకున్న ఈ నిర్ణయం తనకోసం కాదని సమాజం కోసమని ప్రజల కోసమని అన్నారు. 2014 ముందు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు లేవు కానీ..టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వ హాయంలోనే బెల్ట్ షాపులు వచ్చి ఎంతోమంది యువకులు చనిపోయారని విమర్శించారు.వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనందరి మీద ఉందని సూచించారు.

ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త తేలిగ్గా తీసుకోవద్దని..బెల్ట్ షాపు ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలని అది ఇప్పుడే ప్రారంభమైందని అన్నారు. బెల్ట్ షాపుల నిర్మూలన అనేది ఓ ఉద్యమం లాగా కావాలని పిలుపునిచ్చారు.బెల్ట్ షాపులు మూసివేయాలని ప్రతి గ్రామంలో దండోరా వేయించండి అని పిలుపునిచ్చారు.ప్రతి గ్రామంలో పదిమందితో ఒక కమిటీ వేయాలని..ఊరి పొలిమేర లోపల గంజాయి గాని మద్యం గాని లేకుండా చేయడం ఈ కమిటీ బాధ్యత అని అన్నారు.విలేజ్ డెవలప్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు.పది మంది యువకులతో బెల్ట్ షాపుల నిర్మూలణ కమిటీల నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు.పదిమంది కమిటీలో నలుగురు మహిళలు ఉండేలా చూడాలని సూచించారు.విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పనితీరును పరిశీలించడానికి త్వరలోనే నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి మునుగోడు మండల గ్రామస్తుల స్టడీ టూర్ ఉంటుందని తెలిపారు.