కాంగ్రెస్‌లో కొండా కల్లోలం.. మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు భేటీ.. 16పేజీల నివేదికను అందజేత..
కొండా దంపతులు మంత్రి కొండా సురేఖ, కొండా మురళీలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్ తో భేటీ అయ్యారు.

Konda Murali Konda Sureka
Warangal Congress: వరంగల్ కాంగ్రెస్‌లో కొండా దంపతులు వర్సెస్ కాంగ్రెస్ నేతలు అన్నట్లుగా కొద్దిరోజులుగా మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధిష్టానం పెద్దలకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులుసైతం చేసుకున్నారు. ఈ క్రమంలో గత శనివారం గాంధీ భవన్ వచ్చి క్రమశిక్షణ కమిటీకి కొండా మురళీ నివేదిక ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై వారం రోజుల్లో లిఖీత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో గురువారం ఉదయం కొండా దంపతులు మంత్రి కొండా సురేఖ, కొండా మురళీలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్ తో భేటీ అయ్యారు.
Also Read: రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. ఈ నెలలోనే.. డేట్ ఇదే.. మీరు అప్లై చేశారా?
పార్టీలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మీనాక్షీ నటరాజన్‌కు తెలియజేశారు. 16పేజీల నివేదికను ఆమెకు కొండా సురేఖ అందజేశారు. అదేవిధంగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారిగా రిపోర్టును అందజేశారు. తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు వివరణ ఇచ్చారు. రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని మీనాక్షి నటరాజన్ కు కొండా దంపతులు తెలిపారు. నిజాలు తెలుసుకున్న తరువాత ఎవరిది తప్పుంటే వాళ్లపై చర్యలు తీసుకోమని కొండా దపంతులు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జికి విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉంటే.. కొండా మురళి మాట్లాడుతూ.. నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని. నలబై నాలుగేళ్ల నుంచి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. నాకు భయపడకపోతే నాపై 23కేసులు పెట్టకపోయేవాళ్లు. పోటా, టడా కేసులకే నేను భయపడలేదు. నాకు భయం లేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అని అన్నారు.
మరోవైపు.. కొండా దంపతులను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు సొంత పార్టీ నేతలు.. మరోవైపు ఇతర పార్టీల నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో 70కోట్లు ఖర్చుపెట్టామని కొండా మురళి చేసిన బహిరంగ వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. కొండా సురేఖపై పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ వేరువేరుగా ఫిర్యాదు చేశారు.