హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది.. వారికి న్యాయసాయం చేస్తుంది: కేటీఆర్

ఇళ్లలో నుంచి పిల్లలు పుస్తకాలను తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా పేదల ఇళ్లను కూలగొడుతున్నారని కేటీఆర్ చెప్పారు.

హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది.. వారికి న్యాయసాయం చేస్తుంది: కేటీఆర్

KTR

Updated On : October 28, 2024 / 5:43 PM IST

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇల్లు కూలగొడతారేమోనని 52 ఏళ్ల బుచ్చమ్మ అనే మహిళ మూడు రోజులు ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారికి న్యాయసాయం చేస్తుందని కేటీఆర్ అన్నారు. ఆనాలోచితంగా ఇష్టమొచ్చినట్లు కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారని చెప్పారు. నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూలగొడుతామంటూ భయానక వాతావారణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు.

ఇళ్లలో నుంచి పిల్లలు పుస్తకాలను తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా పేదల ఇళ్లను కూలగొడుతున్నారని కేటీఆర్ చెప్పారు. బుచ్చమ్మ కుటుంబాన్ని చూస్తే బాధనిపిస్తోందని, ఎంతో కష్టపడి బిడ్డలకు ఉపయోగపడుతుందని ఇళ్లు కట్టామని బుచ్చమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారని తెలిపారు.

ఆలోచన, ప్రణాళిక, పద్ధతి లేకుండా చేశారని కేటీఆర్ అన్నారు. వాళ్లే పర్మిషన్లు ఇచ్చి ట్యాక్స్ కట్టించుకొని వాళ్లే ఇల్లు కూలగొడుతారంట అని విమర్శించారు. ప్రభుత్వ చర్యల కారణంగా పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గరీబోళ్ల ఇళ్లు కూలగొట్టి హైడ్రా పేరుతో దందా చేస్తున్నారని అన్నారు. బుచ్చమ్మ కుటుంబానికి అండగా ఉంటామని, ఆమె కుటుంబానికి ఆర్థిక సాయం చేశామని తెలిపారు.

నామినేషన్‌ వేయడానికి వచ్చినప్పుడు ఈ అనుభవం ఎదురైంది.. ఆసక్తికర ఘటన గురించి చెప్పిన ప్రియాంకా గాంధీ