ఎవర్ని కదిపినా ఒక్కటే మాట.. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటున్నారు.. కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో కేటీఆర్, హరీశ్ రావు

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

ఎవర్ని కదిపినా ఒక్కటే మాట.. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటున్నారు.. కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో కేటీఆర్, హరీశ్ రావు

KCR birthday celebrations at Telangana Bhavan

Updated On : February 17, 2025 / 3:28 PM IST

KCR Birthday: కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకునే లక్ష్యంతో ముందుకెళ్దామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో వేడులు నిర్వహించారు. 71 కిలోల భారీ కేక్ ను కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు కట్ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ కారణజన్ముడు. కేసీఆర్ నా ఒక్కడికే హీరో కాదు.. తెలంగాణ మొత్తానికి హీరో. ఆయన కడుపున పుట్టడం నా అదృష్టం. ఆయన మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు గట్టిగా పనిచేద్దాం. రానున్న మూడున్నరేళ్లు 60లక్షల గులాబీ దండు అదే లక్ష్యంతో ముందుకెళ్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read: KCR Birthday: కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్.. కేటీఆర్, హరీశ్ రావు ఎమోషనల్ ట్వీట్

మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ జన్మదినాన్ని పండగలా తెలంగాణ జరుపుకుంటోంది. కేసీఆర్ అంటే ఒక భావోద్వేగం. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వయస్సు 15యేళ్లు. నాటి నుంచి నేటి వరకు ఉద్యమంకోసం నిరంతరం పాటుపడ్డ వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ పదవులకోసం తెలంగాణ ఉద్యమం చేస్తున్నారని నాటి నాయకులు అన్నారు. అయినా మూడు పదవులు వదిలేసి తెలంగాణ ఉద్యమం నడిపి, ప్రొఫెసర్ జయశంకర్ తో కలిసి నడిచారు. ఎన్నో రకాలుగా ఇబ్బందిపెట్టినా కేసీఆర్ ఉక్కు సంకల్పం, మొండి పట్టుదలతో తెలంగాణ ఉద్యమంకోసం పోరాడారు. ఆమరణ దీక్షకు కూర్చొని ‘కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ముందుకెళ్ళారని హరీశ్ రావు గుర్తు చేశారు.

Also Read: Harish Rao : హరీశ్ రావు కీలక నిర్ణయం.. పాదయాత్రకు ప్లాన్.. ఎందుకీ పాదయాత్ర, ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు..

ప్రతిరంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్.. దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా నిలిపారు. కేసీఆర్ కు తెలంగాణకు తల్లీబిడ్డ బంధం అని హరీశ్ రావు అన్నారు. ఈ మధ్య కేసీఆర్ పాలనపై అవాకులు చవాకులు పేలుతున్నారు. 20-20 మ్యాచ్ ఆడుతున్నా అని కొందరు అంటున్నారు.. నువ్వు 20-20 మ్యాచ్ ఆడేది డబ్బు సంచులు కోసం. కేసీఆర్ కు అన్నీ ఆడొచ్చు. అవసరమైతే డిఫెన్స్ ఆడుతాడు, అవసరం అయితే సిక్స్ కొడుతాడు.. అంటూ ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఓడొచ్చు కానీ వచ్చే టర్మ్ మనదే.. వస్తె మళ్ళీ మూడు టర్ములు మనమే ఉంటాం. ఎవడెవడో ఏదేదో మాట్లాడుతారు..అవన్నీ పట్టించుకోవద్దు అంటూ కార్యకర్తలకు సూచించారు.