KTR : రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే జీపీ లే అవుట్లు వందలాదిగా వెలిశాయి. అప్పట్లో అనుమతించి ఇప్పుడు కాదంటే ప్లాట్లు కొన్న వాళ్లు

KTR : రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

KTR

Updated On : November 2, 2024 / 10:34 PM IST

KTR : తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హెచ్ఎండీఏ జీపీ లేఔట్లలో రిజిస్ట్రేషన్ల బంద్ మూర్ఖపు చర్య అని అన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టింది చాలాదా? ఇప్పుడు వాళ్లకు ప్లాట్లు కూడా లేకుండా చేస్తారా అంటూ ప్రశ్నించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయటమేమిటి.. బిల్డర్ల నుంచి స్వ్కేర్ ఫీట్ కు, పేద, మధ్యతరగతి ప్రజల నుంచి చదరపు గజానికి వసూళ్లు చేయడానికా? ఎవరో చేసిన తప్పునకు ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లను బాధితులను చేస్తారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Chiranjeevi – Kishan Reddy : మెగాస్టార్ ని కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఫొటోలు వైరల్..

మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే జీపీ లే అవుట్లు వందలాదిగా వెలిశాయి. అప్పట్లో అనుమతించి ఇప్పుడు కాదంటే ప్లాట్లు కొన్న వాళ్లు ఏమై పోవాలని రేవంత్ సర్కార్ ను కేటీఆర్ ప్రశ్నించారు. పేద, మధ్య తరగతి ప్రజలంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపమని కేటీఆర్ ప్రశ్నించారు.