KTR: వారికి రైతుబంధు ఇస్తారా? లేదా?: అసెంబ్లీలో కేటీఆర్

రైతు బంధుకు ప్రభుత్వం కోతలు పెట్టే ఉద్దేశంతో ఉందని కేటీఆర్ చెప్పారు.

KTR: వారికి రైతుబంధు ఇస్తారా? లేదా?: అసెంబ్లీలో కేటీఆర్

Updated On : December 21, 2024 / 12:54 PM IST

తెలంగాణ సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్‌ సర్కారు హయాంలో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరగడానికి రైతుబంధు ఇచ్చామని తెలిపారు.

తెలంగాణలో 2019-20లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలు ఉంటే 2020-21లో అది 204 లక్షల ఎకరాలకి పెరిగిందన్నారు. తాము 4.50 లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలిచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు పోడు పట్టాలున్న గిరిజనులకు రైతుబంధు ఇస్తుందా? అని అడిగారు.

అంతేగాక, రైతు బంధుకు ప్రభుత్వం కోతలు పెట్టే ఉద్దేశంతో ఉందని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను 10 రోజులు పొడిగించాలని కేటీఆర్ అన్నారు. విద్యుత్తు, నీటిపారుదల, మిషన్‌ భగీరథపై చర్చ జరపాలని చెప్పారు. అలాగే, నల్లగొండ జిల్లా అభివృద్ధిపైనా చర్చ జరగాలని అన్నారు.

బీఆర్ఎస్‌ హయాంలో తెలంగాణలో 24 గంట‌ల విద్యుత్ ఇవ్వ‌లేద‌ని తెలంగాణ మంత్రి కోమ‌టిరెడ్డి అంటున్నారని కేటీఆర్ చెప్పారు. గత సర్కారు పాల‌న‌లో స‌గ‌టున 19.2 గంట‌ల విద్యుత్ ఇచ్చిన‌ట్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ స్వయంగా అన్నారని తెలిపారు. స‌భను వాయిదా వేసి న‌ల్ల‌గొండ జిల్లాకు వెళ్లి అక్కడి విద్యుత్ ప‌రిస్థితులు ప‌రిశీలిద్దామని సవాలు విసిరారు.

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ.. భారీ బందోబస్తు