బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

BRS MLA KTR

Updated On : April 7, 2024 / 2:43 PM IST

BRS Leader KTR : లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలుసైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో ఆయన వర్గీయులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పొటోను ట్వీట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మ‌రో ఎమ్మెల్యే

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అంటూ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13వ పాయింట్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళితే వెంటనే అనర్హత వేటు పడేలా చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ  చెప్పింది. కానీ, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి కాంగ్రెస్ లో చేర్పించుకుంటుందని కేటీఆర్ విమర్శించారు. గెలిచేంత వరకు ఒక మాట.. గెలిచాక ఇంకో మాట.. ఇదే కాంగ్రెస్ రీతి, నీతి. బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటో చెప్పాలంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read : నయా నాటకానికి తెరతీశారు..! కాంగ్రెస్ జనజాతర సభపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు