KTR : మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు.. ట్విట‌ర్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. నాపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకంగా నేను ధృడమైన నిర్ణయం తీసుకున్నాను. మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ..

KTR : మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు.. ట్విట‌ర్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR and Konda Surekha

Updated On : October 22, 2024 / 10:59 AM IST

Defamation suit by KTR against Konda Surekha: మంత్రి కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం కేసు పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది. అయితే, తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Harsha Sai : హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి.. ముందస్తు బెయిల్ కోసం..

కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. నాపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకంగా నేను ధృడమైన నిర్ణయం తీసుకున్నాను. మంత్రి కొండా సురేఖ తనపై చేసిన దురుద్దేశపూరితమైన, చౌకబారు వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై 100 కోట్ల పరువు నష్టం దావా వేశాను. ప్రజాప్రతినిధిగా.. నేను వ్యక్తిగత వివాదాల కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాను. రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు వ్యాఖ్యలుచేసే వారికి ఇది గుణపాఠం కావాలి. కోర్టులో నిజం గెలుస్తుందని నాకు నమ్మకం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.