KTR : హిందూ-ముస్లింలకు పంచాయతీ, ఇండియా-పాకిస్తాన్ మధ్య గొడవ తప్ప నమో చేసిందేమిటి?- మంత్రి కేటీఆర్

70 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 110 రూపాయలైంది. 500 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1100 రూపాయలు అయ్యింది. KTR

KTR : హిందూ-ముస్లింలకు పంచాయతీ, ఇండియా-పాకిస్తాన్ మధ్య గొడవ తప్ప నమో చేసిందేమిటి?- మంత్రి కేటీఆర్

KTR Slams BJP And Congress

KTR – PM Modi : జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో ప్రగతి నివేదన సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీలపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్నా చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో స్కామ్ లు చేస్తే, బీజేపీ పాలనలో మత విద్వేషాలు తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ చేసి చూపిందన్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే తెలంగాణలో అభివృద్ధి కొనసాగుతుందన్నారు కేటీఆర్.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ 50వేల మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు కేటీఆర్. ఈ ప్రగతి నివేదన సభ ఒక విజయోత్సవ సభలా ఉందన్నారు మంత్రి కేటీఆర్. కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ కు ఒక తమ్ముడిలా ఉంటారని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ ను విడిచిపెట్టి పోను అన్న వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also Read..BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

”ధర్మపురి పట్టణానికి మరొక 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి విడుదల చేస్తాను. అమ్మ పెట్టదు అడక్క తీయనీయదు అన్నట్టు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. 2,750 కోట్ల రూపాయలు మీ ఆసరా ఫించన్లు పడ్డాయి. 73వేల కోట్లు రూపాయల రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో పడింది. ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఏ గ్రామం వెళ్లైనా సరే కరెంట్ తీగలు పట్టుకోండి. కరెంట్ వస్తుందా లేదా తెలుస్తుంది. 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా? కరెంట్ గురించి మాట్లాడాలంటే కాంగ్రెసోళ్లకు సిగ్గుండాలి.

 

ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టింది కనిపించడం లేదా? 55 సంవత్సరాలలో 200 రూపాయల పెన్షన్లు ఇచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు 4వేలు ఇస్తామని అంటున్నారు. ఇది నమ్మొచ్చా? రేవంత్ రెడ్డి అంటున్నారు తెలంగాణలో 24 గంటల కరెంటు ఎందుకు? 3 గంటలు కరెంట్ అంటున్నారు. మాట్లాడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమో అంటారు తప్ప ఈ తొమ్మిదేళ్లలో చేసిందేమీ లేదు ఈ నమో బీజేపీ.

హిందూ ముస్లింలకు పంచాయతీ, ఇండియా పాకిస్థాన్ గొడవ తప్ప.. చేసిందేమీ లేదు. నరేంద్ర మోదీ వచ్చినప్పుడు పెట్రోల్ ధర 70 రూపాయలు ఉంది. ఇప్పుడు 110 రూపాయలైంది. 500 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1100 రూపాయలు అయ్యింది” అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Also Read..Jagtial: జగిత్యాల త్రిముఖపోరులో గట్టెక్కేదెరో.. జీవన్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా?