కేటీఆర్‌ వ్యాఖ్యలపై భట్టి ఫైర్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ..

భట్టి వెంటనే తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్‌ సభ్యులు అన్నారు. చివరకు సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.

కేటీఆర్‌ వ్యాఖ్యలపై భట్టి ఫైర్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ..

KTR Vs Bhatti Vikramarka

Updated On : March 26, 2025 / 3:01 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పలు కామెంట్లు చేయడంతో దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.

తెలంగాణలో ఏవైనా పనులు జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీలు నేతలు 30% కమీషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు 20%, 30% వరకు కమిషన్ తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అంటున్నారని చెప్పారు. సెక్రటేరియట్లో ఇదే విషయంపై భట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గర వారు ధర్నా చేశారని కేటీఆర్ అన్నారు.

దీంతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే సభలో క్షమాపణ చెప్పాలని అన్నారు. భట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు చెప్పారు. ఇరు పార్టీల సభ్యులు మాటలు అనుకోవడంతో గందరగోళం నెలకొంది.

కేటీఆర్ కామెంట్స్ ను రికార్డ్ లో నుంచి తొలగిస్తున్నట్లుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. భట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత తమకు కూడా మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, హరీశ్ రావు పట్టుబట్టారు. స్పీకరు కుదరదన్నారు.

ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ భట్టి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్‌ సభ్యులు డిమాండ్ చేశారు. సభలో బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేశారు. భట్టి వెంటనే తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. చివరకు సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.

నకిరేకల్‌లో కేటీఆర్‌పై కేసు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నల్గొండ జిల్లా నకిరేకల్ పీఎస్ లో కేసు నమోదైంది. టెన్త్ పేపర్ మాస్ కాపీయింగ్ లో నకిరేకల్ మునిసిపల్ ఛైర్మన్, ఎమ్మెల్యే వీరేశం పీఏల హస్తం ఉందంటూ పలు వెబ్ మీడియాలో పోస్టులు వచ్చాయి. వాస్తవ, అవాస్తవాలు తెలుసుకోకుండా వాటిని ఎక్స్‌లో షేర్ చేశారని, తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్, మన్నెం క్రిశాంక్, దిలీప్ పై మునిసిపల్ ఛైర్మన్ రజిత, మరో వ్యక్తి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్, క్రిశాంక్, దిలీప్ పై కేసులు నమోదయ్యాయి.