గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు : కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నుంచి జాయినింగ్స్

  • Published By: bheemraj ,Published On : November 20, 2020 / 09:54 AM IST
గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు : కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నుంచి జాయినింగ్స్

Updated On : November 20, 2020 / 10:54 AM IST

leaders joining bjp : గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలోని అసంతృప్తులను, టికెట్లు రాని బలమైన నేతలను కమలం పార్టీ తన కండువా కప్పి ఆహ్వానిస్తోంది. దుబ్బాక అసెంబ్లీ విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. గ్రేటర్‌లో పాగా వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా మెజార్టీ సీట్లు గెలవాలని భావిస్తూ.. చేరికలను ప్రోత్సహిస్తోంది. కీలకమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.



హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బండ కార్తీకతో పాటు అడ్డగుట్టకు చెందిన కీలక నేత అశ్విని టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. భరత్ నగర్ డివిజన్‌ నుంచి గోదావరి అంజిరెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రాగా.. ఫతేనగర్ డివిజన్‌ నుంచి టీడీపీకి చెందిన కృష్ణగౌడ్ కమలం గూటికి చేరారు.



https://10tv.in/ghmc-election-nomination-time-until-3pm-on-friday/
ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన తిరుపతి యాదవ్, వనస్థలిపురంకు చెందిన వెంకటేశ్వర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక నామినేషన్లకు నేడు చివరి తేదీ కావడంతో చాలా మంది ఆశావాహులు, టికెట్లు దక్కని వారు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.



ఇటీవల మైలార్‌దేవ్ పల్లి టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. ఆయనకు తాజాగా సీటు కన్ఫామ్ అయ్యింది. వెంగళరావు నగర్ సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కిలార్ మనోహర్ రాత్రికి రాత్రే పార్టీ మారగా.. ఆయనకు తెల్లారెసరికి సీటు ఓకే అయ్యింది.



కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన నర్సింహారెడ్డికి మన్సూరాబాద్ టికెట్ దక్కింది. ఖైరతాబాద్ టికెట్‌ను ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శ ముద్దిరాజు బంధువు వీణ మాధురికి సీటు లభించింది.