Rains In Telangana: శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

రాష్ట్రంలో శుక్రవారం తేలిక నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా, శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

Rains In Telangana: శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

Updated On : March 24, 2023 / 3:34 PM IST

Rains In Telangana: తెలంగాణలో రాబోయే మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం.. రాష్ట్రంలో శుక్రవారం తేలిక నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా, శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Twitter Blue: ఇండియాలో ట్విట్టర్ బ్లూ నెలకు రూ.9,400.. ఏప్రిల్ 1 నుంచి అమలు

శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల ), వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఇంటీరియర్ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా విదర్భ వరకు, సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది.

ఒక ఉపరితల ఆవర్తనం రాయలసీమతోపాటు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష సూచనతో రైతులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు.