Liquor Sale: ఒక్క రోజే తెలంగాణలో ఎంత తాగారంటే.. మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డు
శనివారం ఒక్క రోజే రూ.215.74 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాల్లో ఇదో రికార్డు. 2021 డిసెంబర్ 31న రూ.171.93 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.

Liquor Sale: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. శనివారం ఒక్క రోజే రూ.215.74 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాల్లో ఇదో రికార్డు.
2021 డిసెంబర్ 31న రూ.171.93 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. గతేడాదితో పోలిస్తే 2022 డిసెంబర్ 31న రూ.43 కోట్ల విలువైన మద్యం ఎక్కువగా అమ్ముడైంది. ప్రభుత్వం అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు అనుమతివ్వడం కూడా దీనికి కలిసొచ్చింది. ఇక డిసెంబర్ చివరి వారంలో కూడా తెలంగాణలో మద్యం రికార్డు స్థాయిలో అమ్ముడైంది. గత డిసెంబర్ చివరి వారంలో తెలంగాణ వ్యాప్తంగా రూ.1,111.29 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంతకుముందు ఏడాది డిసెంబర్ చివరి వారంలో రూ.925 కోట్ల విలువైన మద్యం అమ్ముడుకాగా, ఈసారి ఏకంగా రూ.185 కోట్ల అదనపు విక్రయాలు జరిగాయి. మొత్తంగా చూస్తే ఈ సారి డిసెంబర్ చివరి వారంలో రెండు లక్షలకుపైగా లిక్కర్ కేసులు, లక్షా ముప్పై వేలకుపైగా బీర్ కేసులు అమ్ముడయ్యాయి.
Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాకా మెట్రో రైల్ సర్వీసులు.. రెండు కారిడార్లలో ప్రారంభం
హైదరాబాద్ నగరంలో కూడా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 76,038 లిక్కర్ కేసులు, 33,985 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో జరిగిన విక్రయాల ద్వారా రూ.82 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా రూ.43.21 కోట్ల మద్యం అమ్ముడైంది. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా కొత్త సంవత్సర వేడుకలు అనుకున్నస్థాయిలో జరగలేదు. అందుకే ఈసారి చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కారణంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.