Telangana Election 2024: తెలంగాణలో ముగిసిన పోలింగ్ సమయం
సాయంత్రం 5 గంటల వరకు సుమారు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.

Telangana Lok Sabha Election 2024 : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్నవారు మాత్రమే ఓటు వేయవచ్చు. 17 లోక్ సభ నియోజకవర్గాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు సుమారు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
LIVE NEWS & UPDATES
-
సిద్దిపేట జిల్లాలో సాయంత్రం 6 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
- 32 - హుస్నాబాద్ నియోజకవర్గ ఓటింగ్ శాతం:- 76.93%
- 33 - సిద్దిపేట నియోజకవర్గ ఓటింగ్ శాతం:- 73.15%
- 41 - దుబ్బాక నియోజకవర్గ ఓటింగ్ శాతం:- 81.72%
- 42 - గజ్వేల్ నియోజకవర్గ ఓటింగ్ శాతం:- 79.70%
- మొత్తం:- 77.80%
-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన పోలింగ్ సమయం
ముఖ్యాంశాలు
- తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ముగిసిన పోలింగ్ సమయం
- 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపల క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
- హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదు
- జహీరాబాద్, నారాయణఖేడ్, నిజామాబాద్ లో పలు కేసులు నమోదు
- ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65శాతం పోలింగ్ నమోదు
- 2019లో 62.77 శాతం పోలింగ్ నమోదు
- పూర్తిస్థాయి పోలింగ్ శాతం రిజల్ట్ రేపు ప్రకటించనున్న ఎలక్షన్ కమిషన్
- సాయంత్రం నాలుగు గంటలకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
-
సా. 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 గంటల వరకు నమోదు అయిన పోలింగ్ 61.16 శాతం
అదిలాబాద్ - 69.81
భువనగిరి - 62.34
చేవెళ్ల - 53.15
హైద్రాబాద్ - 39.17
కరీంనగర్- 67.67
ఖమ్మం- 70.76
మహబూబాబాద్- 68.60
మహబూబ్నగర్- 68.40
మల్కాజిగిరి- 46.27
మెదక్- 71.33
నాగర్ కర్నూల్ - 66.53
నల్గొండ- 70.36
నిజామాబాద్- 67.96
పెద్దపల్లి- 63.86
సికింద్రబాద్- 42.48
వరంగల్- 64.08
జహీరాబాద్- 71.91సికింద్రబాద్ కంటోన్మెంట్ - 47.88
-
ఓటు వేసిన మహేష్ బాబు, నమత్ర
హైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమత్రా శిరోద్కర్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ నటుడు బ్రహ్మానందం కూడా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేశారు.
-
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ సమయం
తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. 5 లోక్‌సభ స్థానాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 గంటల వరకే ఈసీ పోలింగ్ గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
అదిలాబాద్ పార్లమెంట్ లోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి, మహబూబ్ బాద్ పార్లమెంట్ పరిధిలో ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కొత్తగూడెం, అశ్వారావుపేట లో పోలింగ్ సమయం ముగిసింది. అప్పటికే క్యూలైన్లలో నిల్చుని ఉన్న వారికి ఓటేవేసే అవకాశం కల్పించనున్నారు అధికారులు.
-
మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ వివరాలు
- తెలంగాణలో మొత్తం కలిపి మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్
- కరీంనగర్ పార్లమెంట్లో 58.24% పోలింగ్ నమోదు
- నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 58.35 శాతం పోలింగ్
- నల్గొండ పార్లమెంట్లో 59.91 శాతం ఓటింగ్ నమోదు
- జహీరాబాద్ పార్లమెంట్లో 63.96 శాతం పోలింగ్
- మెదక్ పార్లమెంట్ స్థానంలో 60.94 శాతం పోలింగ్ నమోదు
-
ఈటల రాజేందర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: మల్కాజగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మీడియాను అడ్రస్ చేస్తూ ఫైట్ ఎక్ బార్ మోదీ సర్కార్ అన్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన ఈటలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.
-
కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదగొట్టారు.
-
- జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న జూపల్లి రామ్, శ్యాం దంపతులు.
-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 గంట వరకు 40.38శాతం పోలింగ్ నమోదైంది.
అదిలాబాద్ -50.18 శాతం
భువనగిరి -46.49 శాతం
చేవెళ్ల -34.56 శాతం
హైద్రాబాద్ -19.37 శాతం
కరీంనగర్-45.11 శాతం
ఖమ్మం-50.63 శాతం
మహబూబాబాద్-48.81 శాతం
మహబూబ్నగర్-45.84 శాతం
మల్కాజిగిరి-27.69 శాతం
మెదక్-46.72 శాతం
నాగర్ కర్నూల్ -45.88 శాతం
నల్గొండ-48.48 శాతం
నిజామాబాద్-45.67 శాతం
పెద్దపల్లి-44.87 శాతం
సికింద్రబాద్-24.91 శాతం
వరంగల్-41.23 శాతం
జహీరాబాద్-50.71 శాతంసికింద్రబాద్ కంటోన్మెంట్..29.03 శాతం
-
మొరాయించిన ఈవీఎంలు.. నిలిచిపోయిన పోలింగ్
కొమురం భీం జిల్లా: రెబ్బెనలోని 275వ పోలింగ్ కేంద్రంలో మోరయించిన ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 265, 285 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోని 238వ పోలింగ్ బూత్ లో మోరాయించిన ఈవీఎం, నిలిచిపోయిన పోలింగ్.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌటలో నిలిచిన పోలింగ్.. 150 ఓట్లు పోల్ అయ్యాక మోరాయించిన ఈవీఎం. మరో ఈవీఎం కోసం బయలుదేరిన ఎన్నికల సిబ్బంది.
-
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి ..
-
తెలంగాణ వ్యాప్తంగా 11 గంటల వరకు 24.31శాతం పోలింగ్ నమోదు..
అదిలాబాద్ -31.51 శాతం
భువనగిరి -27.97 శాతం
చేవెళ్ల -20.35 శాతం
హైద్రాబాద్ -10.70 శాతం
కరీంనగర్-26.14 శాతం
ఖమ్మం-31.56 శాతం
మహబూబాబాద్-30.70 శాతం
మహబూబ్నగర్-26.99 శాతం
మల్కాజిగిరి-15.05 శాతం
మెదక్-28.32 శాతం
నాగర్ కర్నూల్ -27.74 శాతం
నల్గొండ-31.21 శాతం
నిజామాబాద్-28.26 శాతం
పెద్దపల్లి-26.17 శాతం
సికింద్రబాద్-15.77 శాతం
వరంగల్-24.18 శాతం
జహీరాబాద్-31.83 శాతంసికింద్రబాద్ కంటోన్మెంట్..16.34 శాతం
-
ఓటు వేసిన కేటీఆర్ ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేటీఆర్ కామెంట్స్..
మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో తేల్చుకునేది ఓటు ద్వారానే.
తర్వాత నిందించిన.. విమర్శించిన లాభం ఉండదు.
అందరూ వచ్చి ఓటు వేయండి. నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి.
తెలంగాణ ప్రభుత్వం కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కరెంట్ కోసం.. ముగ్గురు అధికారులను పెట్టి జనరేటర్ లను పెట్టింది.
తెలంగాణ తెచ్చిన పార్టీ, తెచ్చిన నాయకుడి పార్టీ కి నేను ఓటు వేశాను. మీరు వేయండి.
-
సిద్దిపేట జిల్లాలో ఉదయం 11 గంటల వరకు..
హుస్నాబాద్ నియోజకవర్గ లో : 30.35 శాతం
సిద్దిపేట నియోజకవర్గంలో : 26.53శాతం
దుబ్బాక నియోజకవర్గంలో : 30.45శాతం
గజ్వేల్ నియోజకవర్గంలో : 29.65శాతం
మొత్తం : 29.23శాతం
-
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. సతీమణి, కుమార్తెతో కలిసి కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్ ..
మాజీ సీఎం కేసీఆర్, ఆయన సతీమణి చింతమడకకు చేరుకొని ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారి వెంట మాజీ మంత్రి హరీశ్ రావు ఉన్నారు.
-
ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటేసిన మంత్రి పొన్నం
సిద్దిపేట జిల్లా : మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లో కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా : గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హుస్నాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజి లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది pic.twitter.com/JhcJC9Rw0f
— Ponnam Prabhakar (@PonnamLoksabha) May 13, 2024
-
సిద్దిపేటలో ఓటు వేసిన హరీశ్ రావు..
సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114 పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఆయన సతీమణి శ్రీనిత, కుమారుడు ఆర్చిస్ మాన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హరీష్ రావు కామెంట్స్ ..
నేను కుటుంబ సభ్యులతో కలిసి భారత్ నగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నా.
రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొంటున్నారు.
గతంలో కంటే ఎక్కువ పట్టణాలలో పోలింగ్ పెరుగుతుంది.
ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారు.
మేధావులు, విద్యావంతులు పోలింగ్లో పాల్గొనాలి.
ప్రజాస్వామ్యం బలపడాలంటే అందురూ ఓటింగ్లో పాల్గొనాలి.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ దేశం.
గత పార్లమెంటు ఎన్నికలలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుంది.
ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలిCast my vote along with my family at #siddipet. I appeal one and all to step out and vote. pic.twitter.com/zkslrVLkKk
— Harish Rao Thanneeru (@BRSHarish) May 13, 2024
-
నల్గొండ : నల్గొండ పబ్లిక్ స్కూల్ బూత్ నెంబర్ 108లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ : నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బూత్ నెంబర్ 99లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి.
-
కొండగల్ బయలుదేరిన సీఎం రేవంత్ ..
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొడంగల్ బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ లో తన ఓటుహక్కును వినియోగించుకోనున్న రేవంత్.
-
ప్రతిఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి : వెంకయ్య నాయుడు
-
నిజామాబాద్: తన ఓటు హక్కును ప్రగతి నగర్ పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్
నిజామాబాద్ జిల్లా: లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తన స్వగ్రామం వేల్పూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
-
జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీనటుడు చిరంజీవి.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొండి.
ఎవరి ద్వారా రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నారో వారిని ఎన్నుకోండి.
ఓటు హక్కు మాత్రమే కాదు అందరి బాధ్యత.
తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరంజీవి.
-
ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి పువ్వాడ దంపతులు.
ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటువేసిన మాజీ మంత్రి పువ్వాడ, ఆయన సతీమణి పువ్వాడ వసంతలక్ష్మీ.
-
కిషన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్. ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోదీ పేరు ప్రస్తావించారని ఫిర్యాదు. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు.
-
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మాక్ పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మొరాయించిన ఈవీఎంలను సరిచేశాం. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాం : రొనాల్డ్ రోస్
-
సికింద్రాబాద్ లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్ధి మాధవీ లత.
పాతబస్తీ వట్టేపల్లిలో ఓటువేసిన అసదుద్దీన్ ఒవైసీ.
-
జయశంకర్ భూపాలపల్లి జిల్లా.. మల్హర్ రావు మండలం తాడిచర్లలో బూత్ నెంబర్ 248లో మెరాయించిన ఈవీఎం.
ఖమ్మం: కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో మోరాయించిన ఈవీఎం. క్యూ లైన్లో ఉన్న ఓటర్లు అసహనం. ఓటు వేయ్యకుండానే వెనుతిరుగుతున్న ఓటర్లు
-
సికింద్రాబాద్..సనత్ నగర్ నియోజకవర్గం పద్మారావు నగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల.
-
జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన సినీ నటుడు అల్లు అర్జున్
-
జూబ్లిహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి
-
బర్కత్ పురాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి
-
ఓబుల్ రెడ్డి స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్.
-
ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.
-
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
17 లోక్ సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
మొత్తం 3.32 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్ ప్రక్రియను ప్రశాంతవాతావరణంలో నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.