మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు.

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం

mahabubnagar mlc byelection 2024 counting

Updated On : June 2, 2024 / 10:57 AM IST

Mahabubnagar MLC Election : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,437 ఓట్లు పోలుకాగా.. 21 ఓట్లు చెల్లనవిగా అధికారులు నిర్ధారించారు. బీఆర్ఎస్ కు 763 ఓట్లురాగా, కాంగ్రెస్ కు 652 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక ఓటు పోలైంది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Also Read : అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ఎవరున్నారంటే?

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగాఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో ఈసీ మార్చి 28న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించింది. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ ముందు వరకు ఇరు పార్టీల క్యాంప్ పాలిటిక్స్ రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే.