Manda krishna Madiga : వినతిపత్రంపై ఎలాంటి హామీ ఇవ్వని రేవంత్.. ఎస్సీ వర్గీకరణ చేస్తానంటే నమ్మేదెలా? : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, రేవంత్ కు కృతజ్ఞత కూడా లేదని విమర్శించారు. రెండు నిమిషాలు మాట్లాడే ఓపిక లేదు కానీ, తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు.

Manda krishna Madiga
Manda krishna Madiga – Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎమ్ఆర్ పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శలు చేశారు. గాంధీ భవన్ లో తాము వినతిపత్రం ఇస్తే ఎలాంటి హామీ లేదన్నారు. రేవంత్.. వర్గీకరణ చేస్తామంటే తాము నమ్మేది ఎలాగని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ కాంగ్రెస్ లో ఉంటారా అని ప్రశ్నించారు. ఎందుకంటే రేవంత్ ఒంటిపై అన్ని పార్టీల జెండాలు మారాయని తెలిపారు. రేవంత్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదని, అయన మాటకు విలువ లేదన్నారు. తన ఎదుగుదల కోసం రేవంత్ ఏదైనా చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ కాంగ్రెస్ లో ఉండబోరని స్పష్టం చేశారు.
మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో లెటర్ రాయమని అడిగానని సమాధానం లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి ఉండాలంటే ప్రతిపక్షం ఒత్తిడి చేయాలన్నారు. రేవంత్ మాటలు పిట్టల దొర మాదిరిగా ఉంటాయని, ఒక రకంగా పిట్టల దొరనే నయమని అన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, రేవంత్ కు కృతజ్ఞత కూడా లేదని విమర్శించారు. రెండు నిమిషాలు మాట్లాడే ఓపిక లేదు కానీ, తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. అహంకారం నెత్తికి ఎక్కకూడదని సూచించారు.
Chandrababu Naidu: టీడీపీ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరుతుందా..! చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే?
తమకు కులతత్వం కంటే మానవత్వం ఉందని కానీ, రేవంత్ కు మాత్రం కులతత్వమే ఉందని ఆరోపించారు. కిషన్ రెడ్డి మాత్రమే కాదు అన్ని పార్టీలలో శ్రేయోభిలాషులు ఉన్నారని తెలిపారు. ప్రతిపక్షం గా కృతజ్ఞత నిరూపించుకోవాలని రేవంత్ కు సూచించారు. ఎంతో మంది రెడ్డిలను చూశాను కానీ, రేవంత్ మాదిరి వ్యక్తులను చూడలేదన్నారు. రెడ్డిల చేతిలో అధికారం, భూములు ఉండాలని రేవంత్ అంటున్నారని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో గాంధీ భవన్ లో తమ ఆవేదన వ్యక్తo చేశాం కానీ, తమను అర్థం చేసుకోకుండా తమపై విమర్శలు చేశారని తెలిపారు. మాదిగల ఋణం తీసుకోకుండా.. అవమాన పరిచే విదంగా మాట్లాడారని వాపోయారు. తన ఎదుగుదలకు మాదిగలు అండగా ఉన్నారని పలు వేదికలపై రేవంత్ చెప్పారని గుర్తు చేశారు. జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, కొడంగల్ ఎమ్మెల్యే, మల్కాజ్ గిరి ఎంపీగా మాదిగల అండదండలతో గెలిచానని రేవంత్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు.
CP Ranganath : పోలీస్ పోస్టింగ్స్ పై ప్రభుత్వ నివేదిక కోరిన ఈసీ.. వరంగల్ సీపీ రంగనాథ్ వివరణ
ఎస్సీ వర్గీకరణపై కిషన్ రెడ్డిని అడగాలంటున్న రేవంత్ కు భాద్యత లేదా అని ప్రశ్నించారు. ఎమ్ఆర్ పీఎస్ చేసిన మానవీయ ఉద్యమాలలో కిషన్ రెడ్డి భాగస్వామి అయ్యారని, సమాజానికి మేలు జరిగిందన్నారు. రేవంత్ వల్ల సమాజానికి ఏం జరిగిందని నిలదీశారు. తమ లక్ష్య సాధనకు ఎవరు మద్దతు తెలిపితే వారికి అండగా నిలుస్తామని చెప్పారు.