Maoist Usha rani surrender : డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఆలూరి ఉషారాణి
డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు ఆలూరి ఉషారాణి లొంగిపోయింది.

maoist usha rani surrender
maoist usha rani surrender : మహిళా మావోయిస్టు నేత ఆలూరి ఉషారాణి శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఉషారాణి దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. మావోయిస్టు నేత ఉషారాణి స్వస్థలం ఏపీలోని తెనాలి ప్రాంతం. ఉషారాణి మద్రాస్ యూనివర్సిటీలో ఎంఏ చదివారు. 1980లలో ఆమె అడవిబాట పట్టారు. 40 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. లొంగిపోయిన ఉషారాణిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దండకారణ్యం డివిజనల్ కమిటీ సెక్రటరీగా ఉషారాణి అలియాస్ పోచక్క పని చేశారని తెలిపారు. ఉషారాణి అనారోగ్య కారణాలతో లొంగిపోయిందని తెలిపారు.
కాగా..తెలంగాణ పరిసర ప్రాంతాలు ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా ఉండేవి. కూబింగ్, ఎన్ కౌంటర్లులు జరుగుతుండేవి. కానీ కొంతకాలంగా అటువంటి జాడలు లేవు. కానీ మరోసారి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి మొదలైంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల సానుభూతిపరులుగా గిరిజనులు మసలుతుంటారు. దీంతో పోలీసులు గిరిజనులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మావోల సమాచారం అందితే తమకు తెలియజేయాలని సూచిస్తున్నారు. తెలంగాణలో మరోసారి మావోయిస్టుల కదలికలు మొదలవ్వటంతో పోలీసులు డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో మావోయిస్టు ఆలూరి ఉషారాణి డీజీపీ ఎదుట లొంగిపోవటం విశేషం.