మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదం కావాలా? ఇలా సింపుల్‌గా బుక్‌ చేసుకోండి..

tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవచ్చని ఆర్టీసీఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు.

మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదం కావాలా? ఇలా సింపుల్‌గా బుక్‌ చేసుకోండి..

Medaram Jatara (Image Credit To Original Source)

Updated On : January 20, 2026 / 7:42 AM IST
  • ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా మేడారం బంగారం
  • సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని బుక్‌ చేసుకునే ఛాన్స్‌
  • tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు 

Medaram Jatara: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించినబుకింగ్ స్టిక్కర్లు, పోస్టర్‌ను ఆర్టీసీ ఆవిష్కరించింది.

tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవచ్చని ఆర్టీసీఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. దీనికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు.

Also Read: మేడారం వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్న రేవంత్ రెడ్డి.. ఫొటోలు చూశారా?

కాగా, ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడారం పరిసరాలను అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవార్ల గద్దెలను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు భారీగా వస్తున్నారు. మేడారం పరిసరాలు విద్యుద్దీపాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఈ జాతరలో భాగంగా ఈ నెల 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకువస్తారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్కకు గద్దె మీదకు తీసుకొస్తారు. ఈ నెల 30న భక్తులు ముక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 31న సాయంత్రం 6 గంటలకు వన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.