Medico Preethi Case : మెడికో ప్రీతి బ్రెయిన్ డెడ్..! ఆశలు వదులుకున్న తండ్రి, నిమ్స్ దగ్గర భద్రత పెంపు

డాక్టర్లు కష్టమేనని అంటున్నారని ప్రీతి తండ్రి నరేందర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెబుతున్నారని వాపోయారు. చికిత్స కొనసాగుతోందని వారు చెబుతున్నా, తమకు సందేహంగానే ఉందన్నారు. మొదటిరోజుతో పోల్చితే తమ కుమార్తె ఆరోగ్యం క్షీణిస్తోందని, శరీరం రంగు కూడా మారిపోతోందని నరేందర్ విలపించారు.

Medico Preethi Case : మెడికో ప్రీతి బ్రెయిన్ డెడ్..! ఆశలు వదులుకున్న తండ్రి, నిమ్స్ దగ్గర భద్రత పెంపు

Updated On : February 26, 2023 / 7:22 PM IST

Medico Preethi Case : తన బిడ్డను చూస్తే భయమేస్తోందంటున్నారు మెడికో ప్రీతి తండ్రి నరేందర్. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయ్యిందని డాక్టర్లు చెబుతున్నారని ఆయన అన్నారు. హోప్ లేదని కూడా చెబుతున్నారని కన్నీరుమున్నీరు అయ్యారు.

ఇటీవల మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ లో ప్రీతి చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్టు తెలుస్తోంది.

ప్రీతి తండ్రి మీడియాతో మాట్లాడారు. డాక్టర్లు కష్టమేనని అంటున్నారని ప్రీతి తండ్రి నరేందర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెబుతున్నారని వాపోయారు. చికిత్స కొనసాగుతోందని వారు చెబుతున్నా, తమకు సందేహంగానే ఉందన్నారు. మొదటిరోజుతో పోల్చితే తమ కుమార్తె ఆరోగ్యం క్షీణిస్తోందని, శరీరం రంగు కూడా మారిపోతోందని నరేందర్ విలపించారు.

Also Read..Medico Preeti Case : వరంగల్ మెడికో ప్రీతి కేసులో నిందితుడు అరెస్టు.. ర్యాగింగ్ తోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

నిన్నటి వరకు కొంత ఆశ ఉండేదని, ఇప్పుడది కూడా పోయిందని ప్రీతి తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపట్లో ప్రీతి ఆరోగ్యంపై నిమ్స్ డాక్టర్లు ప్రత్యేక బులెటిన్ విడుదల చేయనున్నారు. అటు, నిమ్స్ దగ్గర భద్రతను పెంచారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) లో సీనియర్ వేధింపులు తట్టుకోలేక పీజీ విద్యార్థిని, డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ప్రీతికి అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని, ఆమెను బతికించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Also Read..Medico Student Preeti : సైఫ్ వేధింపులపై ఫోన్ లో తల్లితో చెప్పి బాధపడిన ప్రీతి

అసలేం జరిగింది?
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న ప్రీతి.. అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.