Telangana Rains : తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. భీకర ఈదురు గాలులు.. హెచ్చరికలు జారీ..
Telangana Rains : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సమాంతరంగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండు కారణాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Telangana Rains
- తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు
- నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
- గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులు
Telangana Rains : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. రెండుమూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఇవాళ (మంగళవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భీకర ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ వివరాలు
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సమాంతరంగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండు కారణాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవాళ (మంగళవారం) ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అదేసమయంలో గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
