Errabelli Dayakara Rao: కేసీఆర్ విజన్ వల్లే.. తెలంగాణలో మాత్రమే బోర్లు వేసుకునే అనుమతి

. కేంద్ర జలవనరులశాఖ కేవలం తెలంగాణలో మినహా దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో బోరులు వేయవద్దని ఆదేశించిందని చెప్పారు.

Errabelli Dayakara Rao: కేసీఆర్ విజన్ వల్లే.. తెలంగాణలో మాత్రమే బోర్లు వేసుకునే అనుమతి

Minister Errabelli

Updated On : June 13, 2023 / 2:57 PM IST

Minister Errabelli Dayakara Rao: నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్, ఎన్టీఆర్ (NTR) లాంటి విజన్ఉన్న నాయకులను చూడలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ (KCR) పై పొగడ్తల వర్షం కురిపించారు. కేంద్ర జలవనరులశాఖ కేవలం తెలంగాణ (Telangana)లో మినహా దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో బోరులు వేయవద్దని ఆదేశించిందని చెప్పారు. కేవలం తెలంగాణ‌లో మాత్రమే బోర్లు వేసుకునే అనుమతి ఉందని. అదంతా కేసీఆర్ విజన్ వల్లనే సాధ్యమైందని చెప్పారు.

CM KCR: ధరణి వచ్చిన తర్వాత.. పైరవీలు, లంచాలు లేవు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ భూగర్భ జలాలు పెరిగేందుకు ప్రత్యేక కృషి చేశారని అన్నారు. ఫలితంగా నేడు తెలంగాణలో గ్రౌండ్ వాటర్ పెరిగిందని, ఈ కారణంగా కేవలం ఒక్క తెలంగాణలో మాత్రమే బోరు వేసుకొనే అనుమతి లభించిందని ఎర్రబెల్లి చెప్పారు. 70ఏళ్ల పాలనలో మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని, కాబట్టే ఆడబిడ్డపై వివక్ష ఉండేదని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని చెప్పారు.

CM KCR : ఏపీలో కరెంట్ ఉండదు, తెలంగాణకు వలస వస్తున్నారు- సీఎం కేసీఆర్

మహిళలు కూలీకు వెళ్లకుండా ఉండాలనే సంకల్పంతోనే కుట్టు మిషన్ శిక్షణ అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలో 10 వేల మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నామని మంత్రి చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న రెండు వేల మంది మహిళలకు ఇప్పటికే ఉద్యోగాలు ఇప్పించామని చెప్పారు. తెలంగాణ మహిళలు గర్వంగా ఫీలవ్వాలన్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకులు బాగుండాలని, అలాంటి నాయకులను కాపాడుకోవాలని మంత్రి కోరారు.