Minister Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లిపై అభిమానంతో.. బహుమతిగా రక్తంతో గీసిన పెయింట్..
మేడారపు సుధాకర్ చూపిన అభిమానానికి సంతోషం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నారు.

Minister Errabelli Dayakar Rao,
Minister Dayakar Rao: సినీ హీరోలకు, రాజకీయ నేతలకు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వీరి పుట్టిన రోజుల్లో వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొందరు బ్లడ్ డొనేషన్ చేయడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమాన నేతల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఓ వ్యక్తి తమ అభిమాన నేతకు జీవితకాలం గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన రక్తాన్ని తీసి.. ఆ రక్తంతో అభిమాన నేత చిత్రాన్ని పెయింట్ వేసి, ఫొటో ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టిన రోజు నేడు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతున్న ఎర్రబెల్లికి అభిమానగణం ఎక్కువే. మంగళవారం వందలాది మంది అభిమానులు అతని నివాసానికి చేరుకొని పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కే.యూ జేఏసీ వైస్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు డాక్టర్.మేడారపు సుధాకర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తన రక్తంతో గీసిన ఫొటో ఆర్ట్ ను బహుమతిగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
CM Jagan : హెరిటేజ్ కోసం అమూల్ డెయిరీని మూసివేసిన వ్యక్తి చంద్రబాబు : సీఎం జగన్
మేడారపు సుధాకర్ చూపిన అభిమానానికి సంతోషం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మేడారపు సుధాకర్ మాట్లాడుతూ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియాజేస్తానని, ఈసారి తన రక్తంతో పెయింట్ వేసి ఆ ఫొటో ఆర్ట్ ను తన అభిమాన నేతకు ఇచ్చినట్లు తెలిపారు.